ఫ్యాన్స్‌కు మెగా షాక్: సైరాను వెంటాడుతున్న మరో రూమర్.. మహేష్, రజనీకాంత్‌తో తప్పని ఢీ
Recommended Video
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సై రా నర్సింహరెడ్డి చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. అయితే సినిమా విడుదల ఎప్పుడనే ఆసక్తి అభిమానుల్లో నెలకొని ఉంది. వాస్తవానికి ఈ చిత్రం తొలుత ఆగస్టు 15న అనుకొన్నారు. కానీ సాంకేతిక కారణాల వల్ల సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈ సినిమా దసరాకు కూడా విడుదలయ్యే పరిస్థితి లేదనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇంతకీ ఆ వార్తలో వాస్తవం ఎంతంటే...

కేరళలో సైరా పోరాటాలు
హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్ తర్వాత సైరా నర్సింహారెడ్డి చిత్ర యూనిట్ కేరళకు వెళ్లింది. కేరళలోని దట్టమైన అడవుల్లో భారీ యాక్షన్ సీన్లను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్‌లో చిరంజీవితోపాటు సినిమాలో నటించే కీలక పాత్రధారులు నటించనున్నారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది. అనంతరం మళ్లీ కొంత వర్క్ హైదరాబాద్‌లో చేయనున్నారు.

భారీగా గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వర్క్
ఇక సైరా నర్సింహారెడ్డి చిత్రంలో గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్‌కు భారీగా స్కోప్ ఉంది. దాంతో ఈ సినిమాను సంబంధించిన గ్రాఫిక్ వర్క్‌ను సవాల్‌గా తీసుకొన్నట్టు సమాచారం. హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని విజువల్ ట్రీట్‌గా తెరపైన కనిపించే విధంగా నిర్మాత రాంచరణ్ చర్యలు తీసుకొంటున్నారట. దాంతో ఈ సినిమా దసరాకు రిలీజ్ కాకపోవచ్చనే రూమర్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

రాంచరణ్ క్లారిటీ ఇస్తే తప్పా...
గతంలో వినయ విధేయ రామ సినిమా ప్రమోషన్ సందర్భంగా.. సైరా చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. నాన్న కేరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచే విధంగా సినిమాను రూపొందించాలన్నది నా కోరిక. ఆ ఇమేజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఉండాలని వర్క్ చేస్తున్నాం. దసరాకు రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాం అని రాంచరణ్ వెల్లడించారు. అయితే తాజా రూమర్ల వస్తావమేనా అనేది రాంచరణ్ వెల్లడిస్తే తప్పా వాస్తవం బయటకు రాదంటున్నాయి సినీ వర్గాలు.

మహేష్, రజనీకాంత్‌తో ఢీ
ఒకవేళ సైరా రిలీజ్ వాయిదా పడి.. 2020 సంక్రాంతికి రిలీజ్ అయితే భారీ చిత్రాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వచ్చే సంక్రాంతికి మహేష్ బాబు 26వ సినిమా, అలాగే రజనీకాంత్ దర్బార్ చిత్రం విడుదల కానున్నాయి. అగ్రహీరోల మధ్య పోటీ రసవత్తరంగా మారడానికి అవకాశం ఉంటుంది. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











