పెళ్లికి తమన్నా గ్రీన్ సిగ్నల్.. వరుడు ఎవరో తెలుసా?

By Rajababu

Recommended Video

Tamannaah Is About To Marry..?

కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నప్పుడు చాలా మంది అందాల తారలకు పెళ్లి మీద ధ్యాసే ఉండదు. సక్సెస్, ఫేమ్‌ను ఎంజాయ్ చేయడంలో వారికి మజా ఉంటుంది. అయితే కెరీర్ కొంత సందిగ్ధంలో ఉన్నప్పుడు పెళ్లిపై ఆలోచన కలుగుతుంది. ప్రస్తుతం మిల్కీ బ్యూటి పరిస్థితి కూడా అదే మాదిరిగా కనిపిస్తున్నది. ప్రస్తుతం తమన్నా పెళ్లి విషయం మీడియాలో హాట్ హాట్‌గా చర్చ జరుగుతున్నది. వివరాల్లోకి వెళితే..

 తమన్నా పెళ్లి వార్త హల్‌చల్

తమన్నా పెళ్లి వార్త హల్‌చల్

తమన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ రంగాల్లో కొంత బిజీగానే కనిపిస్తున్నప్పటికీ ఆమె గ్రాఫ్ అంతగా జోష్‌లో లేదనే చెప్పాలి. బాహుబలి లాంటి చిత్రాల్లో నటించిన తమన్నాకు అంతగా పేరు రాలేదు. అవకాశాలు రాలేదు. తమిళ క్వీన్ రీమేక్ చేజారింది. తెలుగులో క్వీన్ ముందుకు సాగి సాగనట్టు కనిపిస్తున్నది. తల్లిదండ్రుల కోరిక మేరకు తమన్నా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 అమెరికా వరుడికి ఓకే

అమెరికా వరుడికి ఓకే

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం తమన్నా కోసం చూసిన వరుడు అమెరికాలో డాక్టర్ అని తెలుస్తున్నది. వైద్య వృత్తిలోనే కాకుండా పలు వ్యాపారాల్లో భాగస్వామ్యమై ఉన్నారట. తమన్నా కూడా ఇష్టపడటంతో త్వరలోనే ఈ జంట ఒక్కటయ్యే అవకాశం ఉంది. నిశ్చితార్ధానికి కూడా ముహూర్తాలు చూస్తున్నారని సమాచారం.

 పెళ్లి తర్వాత నటిస్తుందా?

పెళ్లి తర్వాత నటిస్తుందా?

సమంత పెళ్లి చేసుకొని కూడా వరుస చిత్రాలతో జోష్ కొనసాగిస్తున్నారు. ఈ తరం తారలకు పెళ్లి కెరీర్ అడ్డంకి కాదనేది పలువురి విషయంలో స్పష్టమైంది. పెళ్లి తర్వాత నటిస్తుందా? లేక అమెరికాలో సెటిల్ అవుతుందా అనేది ఆమె తీసుకొనే నిర్ణయం బట్టి ఉంటుంది.

తమన్నా సినిమాలు ఇవే

తమన్నా సినిమాలు ఇవే

క్వీన్ తెలుగు రీమేక్ దట్ ఈజ్ మహాలక్ష్మీ, సవ్యసాచి (గెస్ట్ సాంగ్), ఎఫ్2 - ఫన్ అండ్ ఫ్రస్టేషన్, సైరా నర్సింహారెడ్డి, ఖామోషీ, కునాల్ కోహ్లీ చిత్రాల్లో నటిస్తున్నది. ఇటీవల నటించిన నా నువ్వే చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయం మూటగట్టుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X