Tamannaah: ఫస్ట్ టైమ్ నందమూరి హీరోతో తమన్నా.. ఆ భారీ సీక్వెల్‌లో మిల్కి బ్యూటీ!
టాలీవుడ్ సినిమా దగ్గర కొన్నేళ్ల కితం టాలీవుడ్ ని రూల్ చేసిన టాప్ హీరోయిన్స్ లో చూస్తే వారిలో దాదాపు అందరు అప్పుడు యంగ్ హీరోలు సహా సీనియర్ స్టార్ హీరోస్ తో కూడా నటించినవారు కనిపిస్తారు. కాజల్ అగర్వాల్ సహా స్వీటీ అనుష్క లాంటి స్టార్స్ సుమారు సీనియర్ హీరోస్ నాగార్జున, చిరంజీవి, వెంకీ మామ లాంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
అలాగే బాలయ్యతో కూడా వారిలో కొందరు నటించారు. కానీ కొన్ని కాంబినేషన్ లు మాత్రం ఇప్పటికీ సాధ్యం కాలేదు. అలాంటి కొన్ని కలయికలో మిల్కీ బ్యూటీ తమన్నా అలాగే నటసింహ బాలయ్య కాంబినేషన్ కూడా ఒకటి. కాగా ఈ ఇద్దరి కలయికలో ఇప్పుడికొచ్చి ఒక సినిమా కూడా రాలేదు కదా కనీసం ఓ సినిమా చేస్తున్నారు అనే రూమర్ కూడా రాలేదు.

కానీ ఇపుడు ఫైనల్ గా వీరిద్దరూ ఒకే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏమిటంటే ఈ ఇద్దరూ హీరో హీరోయిన్స్ గా ఆ సినిమాలో కనిపించరని తెలుస్తుంది. కాగా ఆ సినిమా ఏదో కూడా కాదు సౌత్ లో సంచలన విజయం సాధించిన చిత్రం "జైలర్" కోసం అందరికీ తెలిసిందే కదా ఆ సినిమాకి ఇటీవల సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు.
కాగా ఆ సీక్వెల్ సినిమానే "జైలర్ 2" ఇందులో ఈ ఇద్దరూ కనిపిస్తారని కోలీవుడ్ వర్గాల్లో పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. నిజానికి తమన్నా జైలర్ 1 లో నటించిన సంగతి తెలిసిందే. అందులో స్పెషల్ సాంగ్ సహా కీలక పాత్ర కూడా ఆమె దక్కించుకుంది. ఇక తనతో పాటుగా మలయాళం నుంచి మోహన్ లాల్, కన్నడ నుంచి శివ రాజ్ కుమార్ లని కూడా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ చూపించడం జరిగింది.

కాగా తాను తెలుగు నుంచి బాలయ్యను పెడదాం అనుకున్నట్టుగా కూడా తెలిపాడు. కానీ ఇపుడు ఫైనల్ గా అది పార్ట్ 2 కి సాధ్యం అయ్యేలా ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక వీటితో పాటుగా పార్ట్ 2 లో తమన్నా ఉండకపోవచ్చు అనే రూమర్స్ కూడా వచ్చాయి. కానీ ఇపుడు ఈమె పేరు కూడా పార్ట్ 2 కి కూడా కనిపిస్తుంది. దీనితో ఈ ఇద్దరూ ఈ సినిమాలో నటిస్తారు కానీ కలిపి హీరో హీరోయిన్ గా కనిపించరు అని చెప్పవచ్చు.
మరి ఈ ఇద్దరు స్టార్స్ నిజంగానే ఉన్నారా లేదా అనేది వేచి చూడాల్సిందే. కాగా రీసెంట్ గానే తమన్నాపై పలు బ్రేకప్ వార్తలు బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక బాలయ్య కూడా భారీ చిత్రం డాకు మహారాజ్ సెన్సేషనల్ సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అలాగే ఈ సినిమా తర్వాత బాలయ్య మరో క్రేజీ సీక్వెల్ అఖండ 2 ని దర్శకుడు బోయపాటితో చేస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











