యువ దర్శకుడితో ఈషా రెబ్బా డేటింగ్.. మ్యారేజ్ డేట్ అప్పుడంటే అంటూ జోరుగా వార్తలు
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్‌లలో పెళ్లి భాజాలు మోగుతున్నాయి. ఒకరి తర్వాత మరొకరు సెలబ్రిటీలు పెళ్లీ పీటలెక్కుతున్నారు. కొందరు తాము ఫలానా నటుడితోనో, నటితోనో రిలేషన్‌లో ఉన్నామని బయటపెడుతున్నారు. ఇంకొందరైతే సీక్రెట్‌గా రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. వారిపై మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాల గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ కోవలోకే వస్తారు ఈషా రెబ్బా - తరుణ్ భాస్కర్ జోడీ. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కొద్దినెలలుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
పెళ్లిచూపులతో స్టార్‌డమ్
2016లో విజయ్ దేవరకొండ - రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన పెళ్లిచూపులు చిత్రంతో దూసుకొచ్చారు తరుణ్ భాస్కర్. డిఫరెంట్ కాన్సెప్ట్, టేకింగ్‌తో తెరకెక్కిన పెళ్లిచూపులు చిత్రం ఆయనకు దర్శకుడిగా మంచి పేరు తీసుకురావడంతో పాటు విజయ్ దేవరకొండ స్టార్ హీరో కావడానికి బాటలు వేసింది. పెళ్లి చూపులు చిత్రంతో తరుణ్ భాస్కర్ పేరు టాలీవుడ్‌లో మారుమోగింది. ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని అందరూ అనుకున్నారు. అయితే ఆ రేంజ్ సక్సెస్‌ను నిలబెట్టుకోలేకపోయారు తరుణ్.

నటుడిగా బిజీ
పెళ్లి చూపులు తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని ఈ నగరానికి ఏమైంది, పిట్ట కథలు, కీడా కోలా సినిమాలు మాత్రమే తను అందించగలిగాడు. మధ్యలో తనలోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేయడంతో పాటు బుల్లితెర హోస్ట్‌గానూ మెప్పించారు. దర్శకుడిగా కంటే తనను నటుడిగానే జనం అంగీకరించడం, ఇదే సమయంలో మంచి పాత్రలు వెతుక్కుంటూ రావడంతో తరుణ్ యాక్టర్‌గా బిజీ అయ్యారు. దర్శకుడిగా మళ్లీ తన మార్క్ చూపిస్తానని తరుణ్ భాస్కర్ పలుమార్లు తెలిపారు.
ఈషాతో ప్రేమలో పడ్డ తరుణ్ భాస్కర్?
తరుణ్ భాస్కర్‌కు గతంలోనే లతా నాయుడుతో వివాహం జరిగింది. ఈవిడ కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే. ప్రొడక్షన్, క్యాస్టూమ్ డిజైనర్‌గా, యాడ్ మేకింగ్‌లోనూ పనిచేస్తున్నారు. తన భర్త తెరకెక్కించిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది, యూటర్న్ సినిమాలకు లతా నాయుడు పనిచేశారు. అయితే ఆ తర్వాత వీరు విడాకులు తీసుకున్నట్లుగా అప్పట్లో టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ క్రమంలోనే తరుణ్ భాస్కర్.. హీరోయిన్ ఈషా రెబ్బాతో ప్రేమలో పడినట్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి.
విశ్వక్‌సేన్ ఇంట్లో జంటగా
అచ్చ తెలుగు అమ్మాయి అయిన ఈషా రెబ్బా.. అందం, అభినయం పరంగా తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. కానీ ఆమెకు అవకాశాలు మాత్రం రావడం లేదు. కొన్ని చిత్రాల్లో సెకండ్ లీడ్‌గానూ నటించారు. ఈ క్రమంలోనే ఓం శాంతి శాంతి శాంతి అనే సినిమాలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బా జంటగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే భాస్కర్, ఈషాలు ప్రేమలో పడ్డారని గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. హీరో విశ్వక్‌సేన్ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకల్లో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా హాజరయ్యారు. ఆ తర్వాత రాజు వెడ్స్ రాంబాయి సినిమా ఈవెంట్‌లో తన లవ్‌స్టోరీపై తరుణ్ భాస్కర్ ఇండైరెక్ట్ కామెంట్స్ ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చింది.
ఈషా - తరుణ్‌ల పెళ్లి ఎప్పుడంటే?
ఈ క్రమంలో తరుణ్ - ఈషా రెబ్బాలు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పలు డేట్స్ వైరల్ అయ్యాయి. తాజాగా దీనికి సంబంధించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బాలు రిలేషన్‌లో ఉన్నారని.. వీరిద్దరూ వచ్చే ఏడాది పెద్దల అంగీకారంతో ఒక్కటి కాబోతున్నారన్నది దాని సారాంశం. దాంతో నెటిజన్లు దీనిపై రకరకాలుగా కామెంట్స్ పెడుతుండగా... మరి తరుణ్, ఈషా రెబ్బాలు ఎలా స్పందిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











