యువ హీరోయిన్‌కు అబార్షన్.. బాయ్‌ఫ్రెండ్ చేసిన పనికి ప్రాణాపాయంతో హాస్పిటల్‌లో!
సినిమా పరిశ్రమలో అఫైర్లు, డేటింగ్స్, సహజీవనం లాంటి వార్తలు సాధారణంగా నిత్యం వినిపిస్తుంటాయి. ప్రధానంగా హీరో, హీరోయిన్ల మధ్య రిలేషన్‌షిప్స్ మీడియాలో హాట్ హాట్‌గా కనిపిస్తుంటాయి. అలాంటి వార్తల్లో టెలివిజన్‌తోపాటు బాలీవుడ్‌లో ప్రముఖంగా వినిపించే హీనా ఖాన్‌పై ఇటీవల గాసిప్స్, రూమర్లు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. తాజాగా ఈ అందాల భామ గురించిన ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వార్తకు సంబంధించిన వివరాలు, ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాల్లోకి వెళితే..
కాశ్మీర్ కుటుంబానికి చెందిన హీనా ఖాన్ ఎంబీఏ పూర్తి చేసి మోడల్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇండియన్ ఐడల్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనడంతో మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. ఆ తర్వాత టెలివిజన్ సీరియల్స్ నటించి మంచి పాపులారిటి సంపాదించుకొన్నది. ఆమె నటించిన యే రిస్తా క్యా కహ్లాతా హై, కసౌటీ జిందగీ కే 2 సీరియల్స్‌కు మంచి రేటింగ్ రావడంతో నటిగా ఆమెకు భారీ ఆఫర్లు వచ్చాయి.

అందంతోపాటు ఆమెకు అభినయం కూడా ప్లస్ కావడంతో బాలీవుడ్‌లో కూడా ఆఫర్లు వచ్చాయి. హ్యాక్డ్, అన్‌లాక్డ్, విష్‌లిస్ట్, లైన్స్, కంట్రీ ఆఫ్ బ్లైండ్ చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా ఫియర్ ఫ్యాక్టర్, ఖత్రోంకా ఖిలాడీ రియాలిటీ షోలో నటించారు. అలాగే బిగ్‌బాస్ 14 షోలో పాల్గొన్నారు.

అయితే యే రిస్తా క్యా కహ్లాతా హై సీరియల్‌లో నటించే సమయంలో హీనా ఖాన్ ప్రేమలో పడ్డారు. ఈ సీరియల్ షూటింగ్ సందర్బంగా 2014 సంవత్సంరలో పరిచయమైన సూపర్‌వైజింగ్ ప్రొడ్యూసర్ రాకీ జైస్వాల్‌తో అఫైర్ కొనసాగిస్తున్నారు. దాదాపు 10 ఏళ్లుగా ఆయనతో సహజీవనం కొనసాగిస్తున్నారు.
అయితే హీనా ఖాన్ వ్యక్తిగత జీవితం గురించి దుబాయ్‌కి చెందిన క్రిటిక్ ఉమేర్ సంధూ చేసిన ట్వీట్ సంచలనం రేపింది. ఆయన తన ట్వీట్‌లో.. 3 రోజుల క్రితం హీనా ఖాన్‌కు అబార్షన్ అయింది. అబార్షన్ వికటించడంతో ఆమె ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. ఆమె శరీరానికి ఇన్‌ఫెక్షన్ సోకి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఆమె పిల్లల్ని కనడం బాయ్‌ఫ్రెండ్ రాకీ జైస్వాల్‌కు ఇష్టం లేదు. దాంతో అబార్షన్ చేయించుకొని రిస్క్‌లో పడింది. ఆమె ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నది అని ఉమేర్ సంధూ ట్వీట్ చేశారు.

అయితే ఉమేర్ సంధూ చేసిన పోస్టుపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇలాంటి తప్పుడు పోస్టులు ఎందుకు పెడుతావు. ఇలాంటి పోస్టులు పెట్టడం మానేయ్. లేకపోతే ఏదో రోజు జైలుకు పోవడం ఖాయం అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ మరో అడుగు ముందేసి.. మీకు ఇంట్లో అక్కా, చెల్లెల్లు లేరా? ఇలాంటి పోస్టులు పెడితే చెప్పుతో కొట్టాల్సి వస్తుంది అని ఓ నెటిజన్ ఘాటుగా స్పందించారు.


Click it and Unblock the Notifications











