తమిళ తారతో టాలీవుడ్ డైరెక్టర్ అక్రమ సంబంధం.. భార్య ఆత్మహత్యాయత్నం!
తెలుగు సినిమా రంగంలో ఓ ప్రముఖ దర్శకుడిపై గుర్తు తెలియని వర్గాలు ఆకాశ రామన్న తరహాలో లీకులు ఇస్తున్నారు. గతంలో ఫ్యామిలీ తరమా సినిమాలు, ప్రేమ కథలు తీస్తూ టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకొన్న ఈ దర్శకుడు ఇటీవల కాలంలో ఫ్లాపుల బారిన పడి కనుమరుగైపోయాడు. అయితే ఆయన ప్రస్తుతం ఓ తమిళ హీరోయిన్‌తో అక్రమ సంబంధం పెట్టుకొన్నారంటూ వాట్సాప్‌లో లీకులిస్తూ ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే ఆ వార్త వివరాల్లోకి వెళితే..
తెలుగు సినిమా దర్శకుడు, తమిళ హీరోయిన్ కొద్దికాలంగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. హైదరాబాద్, చెన్నై నగరాల్లో అక్రమంగా రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తున్నారు. తన భార్యను మోసం చేస్తూ ఆయన హీరోయిన్‌తో శృంగార జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన భార్య కాపురాన్ని మీడియా కాపాడే ప్రయత్నం చేయాలి అంటూ ఓ వార్తను వాట్సప్‌లో షేర్ చేశారు.

ఆ వార్త సంచలనం మారిన తర్వాత సదరు దర్శకుడు, తమిళ తార మధ్య అక్రమ సంబంధం అబద్దం కాదు. ఈ వార్తను గాసిప్ అని కొట్టిపడేయకండి. ఓ కాపురంలో తలెత్తిన సమస్య, కాబట్టి భార్యను మోసం చేస్తూ మరో యువతితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న దర్శకుడి గురించి ప్రజలకు, సినీ వర్గాలకు తెలియాల్సిన అవసరం ఉంది అంటూ మరో వార్తను మెసేజ్ రూపంలో పంపించారు.
ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 14వ తేదీన దర్శకుడు, హీరోయిన్ ప్రేమికుల రోజును స్పెషల్‌గా ప్లాన్ చేసుకొన్నారు. వారు హైదరాబాద్‌లో గానీ, చెన్నైలో ఆ రోజును గడిపేందుకు రెడీ అవుతున్నారు. కాబట్టి దయచేసి దర్శకుడి కుటుంబాన్ని కాపాడండి అంటూ వాట్సప్‌లో మరో వార్తను లీక్ చేశారు. ఇలా ఆకాశ రామన్న తరహాలో వార్తలను లీక్ చేస్తున్నారు. కానీ మీడియా ముందుకు వచ్చి చెప్పడానికి వెనుకంజ వేస్తున్నారు.
అయితే తాజాగా మరో వార్తను లీక్ చేస్తూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దర్శకుడు, హీరోయిన్ మధ్య రహస్యంగా శృంగార జీవితం కొనసాగుతున్నది. ఈ బాధ భరించలేక ఆయన భార్య ఇటీవల ఆత్మహత్య ప్రయత్నం చేసింది. కాబట్టి మీడియా ఈ వ్యవహారాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చి ఆ కాపురాన్ని కాపాడండి అంటూ తాజాగా మరో వార్తను లీక్ చేశారు.


Click it and Unblock the Notifications











