టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టు.. స్టార్ హీరోయిన్‌కు వేధింపులు.. డ్రగ్స్ కేసుతో బ్లాక్‌మెయిల్!
తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ వివాదం రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నది. రేవంత్ రెడ్డి సర్కార్ జరుపుతున్న దర్యాప్తులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. అయితే ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై ప్రతిపక్ష పార్టీ నేతలు ఖండిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఓ హీరోయిన్ ఫోన్ కాల్స్ ట్యాపింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేశారనే విషయం అత్యంత వివాదాస్పదంగా మారింది. ఆ హీరోయిన్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు అంటూ తమపై వస్తున్న ఆరోపణలపై ప్రతిపక్ష నేత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అయితే గియితే నలుగురు, ఐదుగురి ఫోన్లను ట్యాప్ చేసి ఉంటామేమో.. అంతేగానీ మేము ఎవరి ఫోన్లను ట్యాప్ చేయలేదని వివరణ ఇచ్చారు. అయితే హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసి.. ఇప్పుడు దొంగ నాటకాలు ఆడటం ఎందుకు అని ప్రస్తుతం ప్రభుత్వంలో మంత్రి ప్రశ్నించారు.

ఇటీవల సీఎం మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఓ నేతకు సినీ తారల ఫోన్లపై మోజుపడ్డారు. పలువురు హీరోయిన్ల ఫోన్ కాల్స్ ట్యాప్ చేసి వారి వ్యక్తిగత విషయాలను తెలుసుకొని వారిని వేధించారు అని అన్నారు. అయితే ఒకరి సంసారంలో జోక్యం చేసుకొని వారి జీవితాలను దెబ్బ తీయడం అవసరమా? ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏమౌతుందని అంటున్నారు. జైల్లో చిప్ప కూడు తినడం ఖాయం. చట్టబద్దంగా దర్యాప్తు చేసి నిందితులను జైలులో పెడుతాం అని ఆయన ప్రశ్నించారు.
అయితే టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రతిపక్ష, అధికార నేతల మధ్య ఆరోపణలు పక్కన పెడితే.. ఓ స్టార్ హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేసి ఆమెను వేధించారు. డ్రగ్స్ కేసుతో సంబంధముందని బ్లాక్ మెయిల్ చేశారు అనే విషయం మీడియాలోను, ఫిలిం నగర్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తున్నది. సదరు హీరోయిన్ పేరు కూడా బాలీవుడ్ డ్రగ్స్ కేసులో వినిపించడం తెలిసిందే.

అయితే డ్రగ్స్ కేసుతో సంబంధముందనే వార్తల నేపథ్యంలో ఆ స్టార్ హీరోయిన్‌ను బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో ఆ బెదిరింపులు, బ్లాక్ మెయిల్‌తో బయపడిన ఆమె వారితో రాజీ పడిందనే విషయాన్ని సినీ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సదరు హీరోయిన్‌పై వస్తున్న ఆరోపణలు నిజమా? కాదా? అనేది త్వరలోనే విచారణలో బయపడుతుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











