బెంగళూరు రేవ్ పార్టీలో ట్విస్టు.. వైసీపీ మంత్రి కారులో టాప్ తెలుగు యాంకర్?

బెంగళూరు రేవ్ పార్టీలో బయటకు వస్తున్న వార్తలు ట్విస్టులపై ట్విస్టులుగా కనిపిస్తున్నాయి. అయితే కన్నడ మీడియాలో నటి హేమ పేరు వెలుగులోకి రావడంతో ఆమె తన వంతు క్లారిటీ ఇచ్చారు. కానీ ఆంధ్రాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఓ మంత్రికి కారు ఆ ప్రాంతంలో లభ్యం అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే మంత్రి కారు విషయంలో ప్రముఖ యాంకర్, ఆ పార్టీ కార్యకర్తగా ఇటీవల ప్రచారం చేసిన సెలబ్రిటీ బయటకు రావడం మరింత ఆసక్తిగా మారింది. అయితే ఆ కారును ఎవరు తీసుకొచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాయి. ఈ వార్త వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తన పుట్టిన రోజు సందర్భంగా బెంగళూరులో భారీగా రేవ్ పార్టీ నిర్వహించారు. అయితే ఈ పార్టీకి వంద మందికిపైగా హాజరు అయినట్టు సెంట్రల్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. పార్టీలో 17ఎండీఎంఏ పిల్స్, కొకైన్ స్వాధీనం చేసుకొన్నట్టు తెలుస్తున్నది.

Is Telugu Top Anchor linked to YSRCP Minister Car in Rave Party in Bangalore

అయితే రేవ్ పార్టీలో సందర్భంగా వైసీపీకి చెందిన ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వంలోని మంత్రికి సంబంధించిన స్టిక్కర్ ఉన్న బెంజ్ కార్ సీజ్ కావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ప్రాంతంలో సదరు మంత్రి ఉన్నాడా? లేదా? ఆయన తరఫున ఎవరైనా వచ్చారా? ఆయన పేరుతో ఉన్న స్టిక్కర్‌ను ఎవరైనా దుర్వినియోగం చేశారా అనే ప్రశ్నల మీద ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అయితే వైసీపీ నేత, ఏపీ మంత్రికి చెందినట్టు భావిస్తున్న బెంజ్ కారులో తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ యాంకర్ వెళ్లినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నది. ఆ యాంకర్ ఇటీవల వైసీపీ పార్టీకి ప్రచారం చేస్తూ ఇతర పార్టీలపై ఘాటైన వ్యాఖ్యలు చేయడం కొంత వివాదంగా మారింది. ఆ యాంకర్ ఆ పార్టీలో ఉన్నట్టు విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది.

అయితే ఆ సదరు యాంకర్ పార్టీలో ఉందా? లేదా? అనే విషయంపై క్లారిటీ లేకపోవడంతో మీడియా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఎవరైనా ప్రత్యర్థి పార్టీలు ఆమెను టార్గెట్ చేసి కావాలనే బురద జల్లుతున్నారా అనేది తేల్చాల్సిన విషయమని మీడియా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే పరిమితంగా ఉండే సదరు మంత్రి కారు స్టిక్కర్‌ను ఎవరు ఉపయోగించారు అనేది తేలితే.. అసలు గుట్టు బయటపడుతుందని అంటున్నారు.

అయితే బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడిన బెంజ్ కారు తనది కాదని సదరు మంత్రి ఖండించారు. దాంతో ఇప్పుడు ఆ స్టిక్కర్ చుట్టే అసలు కథ తిరుగుతున్నది. కొందరైతే మంత్రి స్టిక్కర్ ఉన్న కారులో యాంకర్ వెళ్లి ఉండాలనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఏది ఏమైనా పోలీసులు ఈ విషయంపై అసలు క్లారిటీ ఇచ్చే వరకు ఇలాంటి రూమర్లు, గాసిప్స్‌గానే అనిపిస్తాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X