టాలీవుడ్‌లో మరో బ్రేకప్.. భార్యకు యువ దర్శకుడు విడాకులు? కారణం ఏమిటంటే?

సినీ పరిశ్రమలో దేశవ్యాప్తంగా విడాకుల సంఘటనలు, వార్తలు అభిమానులను, సినీ వర్గాలను దిగ్బ్రాంతికి గురిచేస్తున్నాయి. గతేడాది ఆరంభంలో అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులతో ప్రారంభమైన విడాకుల వార్తలు ఇటీవల ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ వరకు మీడియాను కుదిపేశాయి. ఇక దక్షిణాది చిత్ర పరిశ్రమలో సమంత, నాగచైతన్య విడిపోయిన ఘటన మరింత హాట్ టాపిక్‌గా, వివాదాస్పదంగా మారాయి. ఈ మధ్యలో చిరంజీవి కూతురు శ్రీజ, కల్యాణ్ దేవ్ విడాకుల విషయం మరింత చర్చనీయాంశమైంది. తాజాగా ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ విడాకుల వార్త కొద్ది వారాలుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఈ వివరాల్లోకి వెళితే..

పెళ్లి చూపులు సినిమాతో

పెళ్లి చూపులు సినిమాతో


దర్శకుడు తరుణ్ భాస్కర్ విషయానికి వస్తే.. సైన్మా షార్ట్ ఫిలింతో ఆకట్టుకొన్నారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో తీసిన పెళ్లి చూపులు సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో దర్శకుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో స్థిరపడిపోయాడు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది చిత్రంతో తన ప్రతిభను మరోసారి నిరూపించుకొన్నారు.

దర్శకుడిగా, నటుడిగా రాణిస్తూ..

దర్శకుడిగా, నటుడిగా రాణిస్తూ..

ఈ నగరానికి ఏమైంది సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ ప్రాజెక్టులు ఏదో కారణంగా పట్టాలెక్కలేకపోయాయి. దాంతో సరైన అవకాశం, సమయం కోసం ఎదురు చూస్తూనే నటుడిగా పలు చిత్రాల్లో నటిస్తున్నారు. నటుడిగా కూడా మంచి మార్కులే కొట్టేస్తూ తన కెరీర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

భార్యతో తరుణ్ భాస్కర్ విడిపోతున్నట్టు..

భార్యతో తరుణ్ భాస్కర్ విడిపోతున్నట్టు..


ఇలాంటి పరిస్థితుల్లో తరుణ్ భాస్కర్, తన సతీమణి లతా నాయుడు విడిపోతున్నట్టు ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. లతా విషయానికి వస్తే.. సినీ పరిశ్రమలో ప్రొడక్షన్, క్యాస్టూమ్ డిజైనర్‌గా, వ్యాపార ప్రకటనల రంగంలో పనిచేస్తున్నారు. ఆమె పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది, యూటర్న్ సినిమాలకు పనిచేశారు. అయితే కొద్దికాలం వరకు కూడా తరుణ్, లతా మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం విదితమే. ఓ ఇంటర్వ్యూలో తన విజయం వెనుక భార్య లత ఉందనే విషయాన్ని స్వయంగా తరుణ్ భాస్కర్ చెప్పడం తెలిసిందే.

తల్లి, భార్య మధ్య విభేదాలే కారణమా?

తల్లి, భార్య మధ్య విభేదాలే కారణమా?


అయితే లత విడిపోవడానికి కారణం తరుణ్ భాస్కర్ తల్లి, నటి గీతా భాస్కర్‌తో ఉన్న విభేదాలే ప్రధాన కారణం అనే మాట వినిపిస్తున్నది. అయితే అత్త గీతాను నిర్లక్ష్యం చేస్తున్నారనే వాదన తెరపైకి వచ్చింది. కోడలి ప్రవర్తనతో విసిగిపోయిన తరుణ్ భాస్కర్ తల్లి ప్రస్తుతం వారికి దూరంగా ఉంటున్నారు అనే విషయం మీడియాలో వెలుగు చూసింది.

డైవోర్స్ అంటూ జోరుగా ఊహగానాలు

డైవోర్స్ అంటూ జోరుగా ఊహగానాలు

అయితే తల్లి, ఇతర సమస్యల కారణంగా వైవాహిక జీవితంలో తరుణ్, లతా నాయుడు మధ్య విభేదాలు చోటు చేసుకొన్నాయి. వారిద్దరూ విడిపోవడానికి సిద్దపడుతున్నారు అనే వార్తలు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అధికారికంగా వీరిద్దరి నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో నిజమా? అబద్దామా అనే విషయంపై చర్చ జరుగుతున్నది. ఈ రూమర్‌పై వీరిద్దరూ స్పందిస్తే గానీ.. ఇలాంటి ఊహాగానాలకు తెరపడే అవకాశం లేదు.

కరోనావైరస్‌తో బాధపడుతున్న తరుణ్

కరోనావైరస్‌తో బాధపడుతున్న తరుణ్


ఇాదిలా ఉంటే తరుణ్ భాస్కర్ ప్రస్తుతం కరోనావైరస్ పాజిటివ్‌తో బాధపడుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఆయనకు కరోనావైరస్ పాజిటివ్ అనే విషయం నిర్ధారణ అయింది. హలో ఫ్రెండ్స్ నాకు కోవిడ్ వచ్చింది. రెస్ట్ తీసుకుంటున్నాను. కోవిడ్ ని సీరియస్ గా తీసుకోండి ఫ్రెండ్స్ అని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయన కోలుకొంటున్నట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X