తల్లి పాత్రకోసం కోట్లు దారపోస్తున్న బాలయ్య.. నిజంగా షాకింగ్!
ఎన్టీఆర్ బయోపిక్ కోసం బాలయ్య ప్రాణం పెట్టి చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్టీఆర్ జీవిత చరిత్ర వెండి తెరపై జనరంగాకంగా ఉండాలనేది బాలయ్య భావన. పైగా ఎన్టీఆర్ జీవితం రాజకీయ అంశాలతో కూడా ముడిపడి ఉంటుంది. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య దాదాపు 64 గెటప్ లలో కనిపిస్తాడట. ఇదిలా ఉండగా బాలయ్య ప్రత్యేక శ్రద్ధ చూపించిన మరో అంశం తన తల్లి బసవతారకం పాత్ర.
తన తల్లి పాత్ర కూడా అందంగా ఆవిష్కృతమవ్వాలని బాలీవుడ్ నటి విద్యాబాలన్ ని ఎంపిక చేసుకున్నారు. బాలీవుడ్ భామల రెమ్యునరేషన్ ఏస్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బసవతారకం పాత్ర కోసం విద్యాబాలన్ 1.5 కోట్ల పారితోషకం అందుకుంటోంది టాక్.

కోట్లు పోయినా పరవాలేదు ఆ పాత్ర అందంగా పడితే చాలు అని బాలయ్య భావిస్తున్నాడు. నిర్మాణం విషయంలో కూడా ఎక్కడా తగ్గడం లేదని సమాచారం. తేజ ఈ చిత్ర దర్శకత్వం నుంచి తప్పుకోవడంతో క్రిష్ లైన్ లోకి వచ్చాడు.


Click it and Unblock the Notifications











