బన్నీపై ఇది వాంటెడ్ నెగిటివిటీ కాదా? అల్లు అర్జున్ విషయంలో కొత్త అనుమానాలు
టాలీవుడ్ నుంచి ఇపుడు పాన్ ఇండియా లెవెల్ హీరోలుగా ఎదిగిన వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనకంటూ ఒక సెపరేట్ స్టాండర్డ్స్ ని సెట్ చేసుకున్నాడు. ఇన్ని రోజులు కేవలం రాజమౌళి వల్ల పాన్ ఇండియా మార్కెట్ ని సొంతం చేసుకున్న హీరోలు కనిపించారు కానీ అల్లు అర్జున్ మాత్రం తన సొంత బ్రాండ్ తోనే పాన్ ఇండియా ఫేమ్ అందుకున్నాడని చెప్పాలి.
కాగా అల్లు అర్జున్ నటించిన చివరి రెండు సినిమాలూ పుష్ప 1 అలాగే పుష్ప 2 లు పాన్ ఇండియా వైడ్ గా భారీ హిట్స్ అయ్యాయి. అయితే ఇపుడు వచ్చిన పుష్ప 2 విషయంలో మాత్రం తనకి అంతా రివర్స్ లో బ్యాడ్ టైం నడుస్తుంది అని చెప్పక తప్పదు. ఈ సినిమా విడుదల అయ్యి ఇండియన్ సినిమా దగ్గర కొత్త రికార్డులు సెట్ చేస్తుంది అని ఆనంద పడాలా లేక అల్లు అర్జున్ జైలుకి వెళ్లడం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం అది కూడా తన ప్రత్యక్ష ప్రమేయం లేని విషయాల్లో అంటూ అభిమానులు ఇపుడు ఆవేదన చెందుతున్నారు.

ఇదే సమయంలో అల్లు అర్జున్ పై నెగిటివిటీ కానీ దాడులు కానీ మరింత ఎక్కువ అయ్యాయి. దీనితో వాంటెడ్ గానే ఓ వర్గం అల్లు అర్జున్ ని టార్గెట్ చేసి ఇలా మానసిక వేదనకి లోను చేస్తున్నారని అభిమానులు వాదిస్తున్నారు. ఆ మధ్య అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సమయంలో కూడా బెయిల్ వచ్చేసినప్పటికీ తనని ఉదయం వరకు జైల్లోనే ఉంచడం వంటివి మరిన్ని అనుమానాలు రేకెత్తించాయి.
సరే ఇవన్నీ అయ్యాయి అనుకుంటే ఇపుడు ఏకంగా అల్లు అర్జున్ పై విమర్శలు చేస్తూ ఒక సర్కాస్టిక్ సాంగ్ కూడా చేసే విధంగా పరిస్థితులు మారాయి. దీనితో అసలు అల్లు అర్జున్ ని నిజం గానే కావాలనే టార్గెట్ చేస్తున్నారా? అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. నిజానికి అల్లు అర్జున్ విషయంలో ఇంట రాద్ధాంతం అవసరం లేదని కొందరి విశ్లేషకుల మాట.
జరిగిన విషాదం జరిగిపోయింది. దానిని మార్చడానికి కుదరదు. ఒక్క అల్లు అర్జున్ అనే కాకుండా సినిమా నిర్మాతలు, అల్లు అరవింద్ సైతం బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. అయినప్పటికీ అవన్నీ వదిలేసి తనని టార్గెట్ చేస్తూ వ్యంగ్యంగా కవర్ సాంగ్స్ కూడా చేయడం అనేది ఆశ్చర్యకరం. దీనితోనే అల్లు అర్జున్ పై వాంటెడ్ నెగిటివ్ ప్లాన్డ్ గా చేస్తున్నారా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా అంటున్నారు.
మరి ఇదంతా ఎందుకు? దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఏంటి? అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉన్నాయి. ఇవన్నీ అల్లు అర్జున్ పై ఎప్పుడు ఆగుతాయో అనేది కూడా చూడాలి. ఇక ప్రస్తుతం అయితే తాను నటించిన పుష్ప 2 ఏకంగా 1700 కోట్లకి పైగా వసూళ్లు దాటి ఇపుడు బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేసే దిశగా దూసుకెళ్తుంది.


Click it and Unblock the Notifications











