సమంతకు ఆ విషయం ముందే తెలుసా? అందుకే నాగ చైతన్యతో విడాకులు తీసుకుందా? లీకైన షాకింగ్ న్యూస్

మిగిలిన రంగాలతో పోలిస్తే సినిమాకు సంబంధించి ప్రతి అంశం హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా ఇందులో కనిపించే లవ్ ట్రాకులు మరింత సెన్సేషన్ అవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే సినిమా రంగంలో ఎంతో మంది ప్రేమ పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. అందులో కొందరు విడాకులు తీసుకుని విడిపోయారు. వారిలో టాలీవుడ్‌కు చెందిన సమంత రూత్ ప్రభు, అక్కినేని నాగ చైతన్య జంట ఒకటి. వీళ్ల గురించి ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకు వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా వీళ్ల విడాకుల కారణం లీక్ అయింది. ఆ వివరాలు మీకోసమే!

సీక్రెట్ లవ్ నుంచి పెళ్లితో
అక్కినేని నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు జంటగా మొదట 'ఏమాయ చేశావే' సినిమా చేశారు. ఇది చేస్తున్న సమయంలో మంచి ఫ్రెండ్స్ అయిన వీళ్లు.. 'ఆటోనగర్ సూర్య' సినిమా చేసిన టైమ్‌లో లవ్‌లో పడ్డారు. అప్పటి నుంచి చాలా కాలం పాటు సీక్రెట్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఆ తర్వాత చై సామ్ పెద్దలను ఒప్పించి ఎంతో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు.

Is This Main Reason Of Samantha and Naga Chaitanya Divorce

ఫుల్ ఎంజాయ్ చేశారుగా
మ్యారేజ్ చేసుకున్న తర్వాత సమంత, నాగ చైతన్య ఎంతో క్రేజీగా గడిపారు. తరచూ పార్టీలు చేసుకోవడం, హాలీడే ట్రిప్‌లకు వెళ్లడం వంటివి చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే తమకు సంబంధించిన పర్సనల్ విషయాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. అదే సమయంలో ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉంటూ ఎన్నో విజయాలను కూడా దక్కించుకున్నారు.

నాలుగేళ్లకే విడిపోయారు
టాలీవుడ్‌లో బెస్ట్ కపుల్‌గా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నాగ చైతన్య - సమంత విడాకులు తీసుకున్నారు. తద్వారా నాలుగేళ్ల తమ వివాహ బంధానికి ముగింపు పలికేశారు. ఈ విషయాన్ని కొన్నేళ్ల క్రితమే అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, ఇకపై తామిద్దరం భార్యా-భర్తలుగా కొనసాగలేమని, చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోతున్నామని తెలిపారు.

Is This Main Reason Of Samantha and Naga Chaitanya Divorce

డివోర్స్‌పై సందేహాలతో
నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకుని చాలా కాలమే అవుతోన్నా అసలు వీళ్లిద్దరూ ఎందుకు విడిపోయారు అనేది మిస్టరీగానే మారిపోయింది. అసలు వీళ్లిద్దరి మధ్య ఏ విషయాల్లో మనస్పర్థలు వచ్చాయి? అనే అనుమానానికి మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదనే చెప్పాలి. దీంతో చాలా మంది ఎవరికి తోచిన విధంగా వాళ్లు చెప్పుకుంటూ దీన్ని హాట్ టాపిక్‌గా మార్చేస్తున్నారు.

సమంతనే అడిగిందని
టాలీవుడ్ జంట సమంత, నాగ చైతన్య ఎందుకు విడాకులు తీసుకున్నారన్న విషయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. అంతా సవ్యంగా సాగిపోతోన్న సమయంలోనే సమంత స్వయంగా నాగ చైతన్యను విడాకులు అడిగిందట. దీంతో అతడు కూడా దీనికి ఒప్పుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.

Is This Main Reason Of Samantha and Naga Chaitanya Divorce

ఆ కారణంగా చెప్పింది
తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. సమంత రూత్ ప్రభుకు మయోసైటిస్ వ్యాధి ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నాగ చైతన్య కంటే ముందే తెలుసుకుందట. దీంతో ఫ్యూచర్‌లో ఇబ్బందులు వస్తాయని భావించిన ఆమె విడాకుల ప్రతిపాదన పెట్టినట్లు తెలిసింది. అంటే.. అనారోగ్యం కారణంగానే సమంత, నాగ చైతన్య విడిపోయారని తాజాగా వచ్చిన న్యూస్ సారాంశం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X