దేశం కోసం ప్రభాస్ మాస్టర్ ప్లాన్.. టాప్ హీరోను ఫాలో అవుతున్న యంగ్ రెబెల్ స్టార్!

By Manoj Kumar P

టాలీవుడ్‌కు చెందిన హీరోనే అయినా దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. సినీ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడతడు. ఈ క్రమంలోనే కెరీర్ ఆరంభంలోనే సూపర్ హిట్లు పడడంతో అతడికి స్టార్‌డమ్ వచ్చేసింది. ఇక, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో ఒకసారిగా యూనివర్శల్ స్టార్ అయిపోయాడు. దీంతో అతడు వరుసగా భారీ సినిమాలనే చేస్తున్నాడు. తాజాగా ప్రభాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

Recommended Video

Lockdown Leads To Prabhas Wedding || Actor Rana Comments
ఒక దానితో గుర్తింపు.. మరో దానితో రికార్డులు

ఒక దానితో గుర్తింపు.. మరో దానితో రికార్డులు

‘బాహుబలి' మూవీ హిందీలోనూ విడుదల కావడంతో ప్రభాస్‌కు బాలీవుడ్‌లో సైతం ఎనలేని క్రేజ్ వచ్చింది. ఇక, ఆ తర్వాత వచ్చిన ‘సాహో' మూవీ ఇక్కడ హిట్ కాకున్నా.. బీ టౌన్‌లో మాత్రం భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ దుమ్ముదులిపేసింది. ఫలితంగా 2019లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.

ఆయన కోసం లవర్ బాయ్‌గా మారిన ప్రభాస్

ఆయన కోసం లవర్ బాయ్‌గా మారిన ప్రభాస్

‘సాహో' వంటి భారీ బడ్జెట్ మూవీ తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. 1960 దశకం నాటి ప్రేమకథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ లవర్ బాయ్‌గా కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

రొమాన్స్ డోస్ పెంచేస్తున్న యంగ్ రెబెల్ స్టార్

రొమాన్స్ డోస్ పెంచేస్తున్న యంగ్ రెబెల్ స్టార్

తన కెరీర్‌లో ప్రభాస్ చాలా లవ్‌స్టోరీలు చేశాడు. అయితే, వాటిలో రొమాంటిక్ మూవీలు మాత్రం లేవు. అందుకే ఈ సారి ఆ లోటును భర్తీ చేయబోతున్నాడట యంగ్ రెబెల్ స్టార్. ఈ మూవీలో పూజా హెగ్డేతో అతడి రొమాన్స్ అదిరిపోతుందని అంటున్నారు. ఆ ఫీల్ ఉండేలా ఈ సినిమాకు ‘ఓ డియర్' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది.

ఈ సారి పాన్ వరల్డ్ మూవీతో వస్తున్నాడు

ఈ సారి పాన్ వరల్డ్ మూవీతో వస్తున్నాడు

రాధాకృష్ణతో సినిమా అయిపోయిన తర్వాత ప్రభాస్.. ఏ దర్శకుడితో పని చేస్తాడన్న దానిపై చాలా ఊహాగానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో ‘మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో అతడు సినిమా చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించే ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‌లో ఉండబోతుందని దర్శకుడు ప్రకటించిన విషయం తెలిసిందే.

అప్పుడు బాలకృష్ణ.. ఇప్పుడు ప్రభాస్

అప్పుడు బాలకృష్ణ.. ఇప్పుడు ప్రభాస్

నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ చేసే సినిమా గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే సినిమా కథ గురించి పలు ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. టైం మెషీన్‌ ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కబోతుందనే టాక్ వినిపించింది. దీంతో బాలయ్య నటించిన ‘ఆదిత్య 369'తో దీన్ని పోల్చేశారు. అలాగే, ‘భైరవ ద్వీపం', ‘పాతల భైరవి' కథలు కూడా తెరపైకి వచ్చాయి.

దాని నుంచి దేశాన్ని రక్షించేందుకు ప్రభాస్ ప్లాన్

దాని నుంచి దేశాన్ని రక్షించేందుకు ప్రభాస్ ప్లాన్

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా కథ గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ మూవీలో ప్రభాస్ టైం మెషీన్‌లో భవిష్యత్‌కు వెళ్తాడట. అప్పుడు దేశానికి ఓ ప్రమాదం జరగబోతుందని తెలుసుకుంటాడట. దీంతో తన ప్రాణాలను లెక్క చేయకుండా సాహసించి దేశాన్ని కాపాడతాడట. ఇదే ఈ సినిమా కథ అని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X