చిరంజీవికి మహేశ్ బాబుకు తేడా వచ్చింది అక్కడే.. సినిమాకు దూరమవ్వడానికి కారణం ఇదే.!
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి మరింత దూకుడుగా ముందుకెళ్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆయన.. అన్ని వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు. అదే సమయంలో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివతో సినిమా చేస్తున్నారు. ఇందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్నాడని జోరుగా ప్రచారం జరిగింది. అయితే, ఇందులో అతడు నటించడం లేదని ఇటీవలే మరో న్యూస్ బయటకు వచ్చింది. అసలు మహేశ్ ఈ మూవీలో ఎందుకు నటించడం లేదన్న దానిపై తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది. ఆ వివరాలు మీకోసం.!

ఉత్సాహంతో చేస్తే.. నిరాశను మిగిల్చింది
మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్' అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ సూపర్ హిట్ అవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. అంతేకాదు, చిరంజీవిలో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. అయితే, ఆ తర్వాత వచ్చిన ‘సైరా: నరసింహారెడ్డి' మాత్రం బాక్సాపీస్ ముందు బోల్తా కొట్టింది. ఫలితంగా ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా నిరాశనే మిగిల్చింది.

బడా డైరెక్టర్‌తో అదిరిపోయే ప్లాన్ వేశారు
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘సైరా' అంతగా ఆడకపోవడంతో చిరంజీవి, రామ్ చరణ్ అదిరిపోయే ప్లాన్ వేశారు. ఇందులో భాగంగానే చెర్రీ మరోసారి తన తండ్రితో సినిమా చేస్తున్నాడు. దీనికి బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్న చిత్ర యూనిట్.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది.

అందరూ అనుకున్నట్లు చేస్తున్నారుగా.!
ఈ సినిమాను దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యంతో తెరకెక్కిస్తున్నారని, అలాగే ఇందులో చిరంజీవి మావోయిస్టులా కనిపించబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఇటీవల షూటింగ్ స్పాట్‌లోని పిక్స్ లీక్ అయ్యాయి. అంతేకాదు, దీనికి ‘ఆచార్య' అనే టైటిల్ అనుకుంటున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో చిరు కన్ఫార్మ్ చేసేశారు.

రామ్ చరణ్ స్థానంలో మహేశ్ బాబు ఎంట్రీ
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే, చెర్రీ స్థానంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబును తీసుకున్నారని ఇటీవల ప్రచారం మొదలైంది. ఈ సినిమాలో 30 నిమిషాల నిడివి ఉన్న ముఖ్యమైన పాత్రలో అతడు నటించబోతున్నాడనే టాక్ వినిపించింది.

చిరంజీవికి మహేశ్ బాబుకు తేడా వచ్చింది అక్కడే
మహేశ్ బాబు ఈ సినిమాలో నటిస్తున్నాడని ప్రచారం జరుగుతున్న సమయంలోనే ఓ షాకింగ్ న్యూస్ కూడా బయటకు వచ్చింది. అదే.. ఇందులో నటించేందుకు మహేశ్ బాబు రూ. 30 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడన్న వార్త. మొత్తం ముప్పై రోజుల డేట్స్ ఇస్తానని చెప్పిన మహేశ్.. ఒక్కో రోజుకు రూ. కోటి డిమాండ్ చేశాడట. ఇది చిరంజీవికి ఏమాత్రం నచ్చలేదని సమాచారం.
Recommended Video

సినిమాకు దూరమవ్వడానికి కారణం ఇదే.!
ఇండస్ట్రీలో ప్రచారం అవుతోన్న సమాచారం ప్రకారం... ఈ సినిమాలో నటించేందుకు మహేశ్ రూ. 30 కోట్లు అడిగిన మాట వాస్తవమే అంటున్నారు. అయితే, చిరంజీవి అండ్ కో మాత్రం రోజుకు రూ. 5 కోట్లు చొప్పున మొత్తం రూ. 15 కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పిందట. అది నచ్చని మహేశ్ బాబు సినిమాలో నటించనని చెప్పాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











