Game Changer : జగన్ - వైఎస్‌ఆర్ మధ్య ఏం జరిగిందంటే? .. గేమ్ ఛేంజర్‌లో హైలైట్‌గా ఆ సీన్
సినిమా అనేది శక్తివంతమైన సాధనం అన్న సంగతి తెలిసిందే. మన చుట్టూ ఉన్న సంఘటనలనే దర్శక నిర్మాతలు సినిమాలుగా తీస్తుంటారు. ఇప్పుడు ఏకంగా బయోపిక్‌ల పేరుతో నిజ జీవిత గాథలనే సినిమాలుగా తీస్తున్నారు. విజేతలతో పాటు కాంట్రవర్సీలు, వివాదాస్పద వ్యక్తుల జీవితాలను తెరపై చూసేందుకు ప్రేక్షకులు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. అలా వీలుకాని పక్షంలో కొన్ని వాస్తవ సంఘటనలకు తమ సినిమాల్లో అవకాశం కల్పిస్తున్నారు మేకర్స్.
ఇదిలాఉండగా.. తమిళ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తుండటంతో పాటు శంకర్ లాంటి అగ్ర దర్శకుడు తొలిసారిగా తెలుగులో ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సామాజిక సమస్యలకు కమర్షియల్ యాంగిల్ జోడించి దానిని సినిమాగా మలిచి భారీ బ్లాక్ బస్టర్స్ కొట్టడం శంకర్ స్పెషలిస్ట్. తన తొలి చిత్రం జెంటిల్మెన్ నుంచి నేటి వరకు ఆయన ఇదే స్టైల్ ఫాలో అవుతున్నారు. శంకర్ సినిమా అంటే ఒకప్పుడు బ్లాక్‌బస్టర్ పక్కా అన్న ఇమేజ్ ఉండేది. కానీ స్నేహితుడు మూవీ నుంచి ఆయన కెరీర్‌లో డౌన్‌ఫాల్ ప్రారంభమైందని విశ్లేషకులు అంటుంటారు. స్నేహితుడు, ఐ, రోబో 2.0 సినిమాలు పర్లేదు అనిపించుకున్నప్పటికీ కమర్షియల్‌గా అనుకున్నంత రాబట్టలేదని శంకర్ విమర్శలు ఎదుర్కొన్నారు.
ఇక ఎన్నో ఆశలు పెట్టుకుని, మరెన్నో వివాదాలు, అవాంతరాలను ఎదుర్కొని గతేడాది విడుదలైన భారతీయుడు -2 దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత శంకర్ - కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా శంకర్ కెరీర్‌లో డిజాస్టర్‌గా నిలిచి ఆయన సామర్ధ్యంపై అనేక అనుమానాలు కలిగించింది. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదని శంకర్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, అంజలి , ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న గేమ్ ఛేంజర్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతోందని ఫిలింనగర్ టాక్.
గురువారం అర్ధరాత్రి నుంచే ఓవర్సీస్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో గేమ్ ఛేంజర్ ప్రీమియర్స్, స్పెషల్ షోలు పడ్డాయి. దీంతో మెగా అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. సినిమా థియేటర్ నుంచే తమ ఆత్మీయులకు స్టేటస్‌ల రూపంలో గేమ్ ఛేంజర్ అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఈ సినిమాలో ఏపీ రాజకీయాలకు సంబంధించి, ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కొన్ని సీన్లు ఉంటాయని తొలి నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు తగినట్లుగానే సీఎం పాత్రలో నటించిన ఎస్‌జే సూర్య పదే పదే తాను ఈ రాష్ట్రంలో 30 ఏళ్ల పాటు సీఎంగా ఉంటానని చెబుతాడు. గతంలో ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 30 ఏళ్ల పాటు రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంటుందని చెప్పేవారు.
Discussion b/w YSR & @ysjagan 🤣
— Changer (@Elchapo_1999) January 9, 2025
#GameChanger pic.twitter.com/v1kufEEcXO
అలాగే మరో సీన్‌లో విలన్‌కు తండ్రిగా నటించిన శ్రీకాంత్ ఆసుపత్రి బెడ్‌పై ఉంటాడు. అప్పుడు ఎస్‌జే సూర్య .. నేను పోతే అంత్యక్రియలు జరగాల్సింది నా చితి మీద కాదు నాన్నా, నన్ను సీఎం సీట్లో పెట్టి అలా జరగాలి అని ఓ జీవో పాస్ చేసిన తర్వాతనే నేను చనిపోతానని చెబుతాడు. ప్రస్తుతం ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిని జగన్‌కు , ఆయన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ముడిపెట్టి నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. మరి దీనిపై వైసీపీ అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











