Breakup లవర్‌తో శృతి హాసన్ బ్రేకప్.. సహజీవనంలో ఆ స్టార్ డైరెక్టరే చిచ్చు పెట్టాడా?

సౌత్ లో కెరీర్ మొదట్లో ఐరన్ లెగ్ అని ముద్ర వేసుకున్న హీరోయిన్ శృతి హాసన్ ఇప్పుడు లక్కీ గర్ల్ గా మారింది. తాజాగా ఈ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పడం వెనక ఓ స్టార్ డైరెక్టర్ ఉన్నారనే పుకారు షికారు చేస్తోంది. ఇంతకీ శాంతను హజారికా, శృతిహాసన్ బంధంలో చిచ్చు పెట్టిన డైరెక్టర్ ఎవరు? అనే విషయంపై మనం కూడా ఓ లుక్కెద్దాం పదండి.

శృతి హాసన్, డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికా దాదాపు నాలుగేళ్లు డేటింగ్ చేశారు. సోషల్ మీడియా ద్వారా జరిగిన వీళ్లిద్దరి పరిచయానికి ఇప్పుడు అదే సోషల్ మీడియా వేదికగా ఫుల్ స్టాప్ పడింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో శృతిహాసన్ శాంతను పెయింటింగ్స్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది.

Is This Star Director reason for Shruti Haasan and Santhanu Hazarika Brekup Film makers details are here

అతను తెలియకపోయినా ఆయన పెయింటింగ్స్ అంటే పిచ్చి అని తన మనసులోని మాటను బయట పెట్టింది. ఆ తర్వాత ఆమె ఇంస్టాగ్రామ్ లో శాంతనుకు మెసేజ్ చేయగా, అలా మొదలైంది వీరిద్దరి ప్రేమ కథ. ఇంస్టాగ్రామ్ లో శాంతనుకు 1,24,000 మంది ఫాలోవర్లు ఉండగా, శృతి హాసన్ తో రిలేషన్ పెరిగాక అతనికి మరింత పాపులారిటీ దక్కింది.

రిలేషన్ స్టార్ట్ అయ్యాక వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తూ ఎప్పటికప్పుడు రొమాంటిక్ ఫోటోలను, సరదాగా ఉన్న వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకునే వాళ్ళు. కానీ హఠాత్తుగా రెండు రోజుల క్రితం శృతిహాసన్, శాంతను హజారికా విడిపోయారు అనే వార్త వెలుగులోకి వచ్చింది.

వీళ్ళిద్దరూ ఇంస్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో అవ్వడమే కాకుండా, ఒకరితో ఒకరు ఉన్న ఫోటోలను కూడా డిలీట్ చేశారు. అయితే నిజానికి వీళ్ళిద్దరి మధ్య బ్రేకప్ జరిగి దాదాపు నెల గడుస్తోందని, పరస్పరం అండర్స్టాండింగ్ తో ఇద్దరూబ్రేకప్ చెప్పుకున్నారని, అప్పటి నుంచి వీరిద్దరూ వేర్వేరు ప్లాట్స్ లో ఉంటున్నారని సమాచారం.

ఇదే విషయాన్ని ఓ మీడియా శాంతనును ప్రశ్నించగా అతను సమాధానం చెప్పడానికి నిరాకరించాడు. వీళ్ళిద్దరూ తమ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఇక ఈ నేపథ్యంలోనే వీళ్లిద్దరు బ్రేకప్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

అసలు శృతిహాసన్, శాంతను విడిపోవడానికి కారణం ఏంటని ఆరా తీయడం మొదలుపెట్టారు వాళ్ళ అభిమానులు. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన శృతిహాసన్ ఓ మ్యూజిక్ ఆల్బమ్ వీళ్ళ రిలేషన్ బ్రేక్ అవ్వడానికి కారణం అంటూ ప్రచారం మొదలైంది.

Is This Star Director reason for Shruti Haasan and Santhanu Hazarika Brekup Film makers details are here

W కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, శృతిహాసన్ ప్రధాన పాత్రలో కనిపించిన రొమాంటిక్ వీడియో సాంగ్ ఇనిమేల్ వీళ్ళిద్దరి బంధంలో చిచ్చు పెట్టిందని టాక్ నడుస్తోంది. అందులో లోకేష్, శృతి మధ్య ఎంతటి ఘాటు రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాతే శృతిహాసన్ కు తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్, ఆ వార్త బయటకు రావడం జరిగాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలీదు గానీ లోకేష్ కారణంగానే వీరిద్దరూ విడిపోయారని అంటున్నారు. అలాగే లోకి, శృతి మధ్య ప్రేమాయణం నడుస్తుందంటూ కొత్త రూమర్లు పుట్టుకొస్తున్నాయి.

More from Filmibeat

Read more about: shruti haasan inimel
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X