45 ఏళ్ల వయసులో రెండో పెళ్ళికి సిద్దమైన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. ఇంతకీ పెళ్లి కూతురు ఎవరంటే?
సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల ప్రేమలు,పెళ్లిళ్లు, విడాకులు సర్వసాధారణం. ఎవరు ఇప్పుడు పెళ్లి చేసుకుంటారో ? ఎవరు ఎప్పుడు తమ వివాహ బంధాన్ని పెంచుకుంటారో..? ఎవరు ఎవరితో సహజీవనం చేస్తున్నారో ? అనేది ఎప్పుడు హాట్ టాపిక్. తాజాగా ఓ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడని, అది కూడా 11 ఏండ్ల కొడుకు ఉన్న మహిళను పెళ్లి చేసుకోబోతున్నారట. ఈ వార్త నెటింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు? అతడు చేసుకోబోయే అమ్మాయి ఎవరో ? మీరు కూడా తెలుసుకోండి.
ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు.. జాగర్లమూడి జాగర్లమూడి రాధాకృష్ణ అలియస్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi). క్రిష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఆయన తీసిన సినిమాలు చాలా ప్రత్యేకం. ప్రతి సినిమా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన తన సినిమాల ద్వారా సందేశాన్ని అందిస్తూ సమాజాన్ని కదిలిస్తారు. గమ్యం అంటూ ఎంతోమందిని ఆలోచింపజేశాడు. కంచె సినిమాతో సమాజంలోని కులమత బేధాలను ప్రశ్నించాడు. వేదం సినిమాతో డబ్బు జీవితంలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో కళ్లకు కట్టినట్లు చెప్పాడు. కృష్ణం వందే జగద్గురు సినిమాతో మైనింగ్ మాఫియా ఆగడాలను చూపించారు.

క్రిష్ దర్శకత్వం వహించిన సినిమాలన్నీ దేనికి అదే ప్రత్యేకం. సహజమైన, నిజ జీవిత, యదార్థ గాధలను ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తూ తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు డైరెక్టర్ క్రిష్. చిన్న అంశంతో సినిమా తీసి.. హిట్ కొట్టగల గ్రేట్ డైరెక్టర్ క్రిష్. ఆయన సినిమాలు సక్సెస్ కావడమే కాదు. ప్రతి సినిమాకు కచ్చితంగా ఏదో విభాగంలో అవార్డు దక్కించుకోవాల్సిందే. 2008లో గమ్యం అనే సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు క్రిష్. ఈ మూవీకి ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు అవార్డు, నంది అవార్డు కూడా గెలుచుకున్నాడు డైరెక్టర్ క్రిష్.
ఆ తర్వాత వేదం, కృష్ణం వందే జగద్గురు, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి బంపర్ హిట్స్ అందుకున్నాడు డైరెక్టర్ క్రిష్. చివరిగా వైష్ణవ్ తేజ్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన 'కొండపొలం' మూవీకి దర్శకత్వం వహించారు. ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా హరి హర వీరమల్లు అనే మూవీని తెరకెక్కించాలని ప్రయత్నించాడు.
కానీ, కొన్ని కారణాలవల్ల హరి హర వీరమల్లు మూవీ డైరెక్షన్ బాధత్యలను నుండి తప్పుకున్నాడు క్రిష్. ఏదిఏమైనా భిన్నమైన కథలతో సినిమాలు తీసి.. తక్కువ టైంలో సక్సెస్ అవుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యాడు డైరెక్టర్ క్రిష్. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తో 'ఘాటీ'(Ghaati) సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం నెట్టింట్లో జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల క్రితం రమ్య అనే డాక్టర్ను పెళ్లి చేసుకున్నాడు క్రిష్ . అయితే వీరి వివాహ బంధంలో మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ మ్యూచువల్ గా డైవర్స్ తీసుకున్నారు. గత కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్న క్రిష్ ఇటీవల రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.
ఇందులో భాగంగానే వచ్చేవారం ఎంగేజ్మెంట్ కూడా జరగనున్నదట. అయితే ఇక్కడ విశేషమేమిటంటే.. గతంలో ఆయన పెళ్లి చేసుకున్నది ఓ డాక్టర్.. ఇప్పుడు కూడా పెళ్లి చేసుకోబోయేది కూడా డాక్టర్ నేనట. పైగా డైరెక్టర్ పెళ్లి చేసుకునే ఆమెకు 11 సంవత్సరాల కుమారుడు కూడా ఉన్నాడని ఇండస్ట్రీ టాక్. వీరి ఎంగేజ్మెంట్, మ్యారేజ్ పై త్వరలోనే ప్రకటన రానున్నదట


Click it and Unblock the Notifications











