For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నారా రోహిత్ సర్జరీ కి సిద్దమవుతున్నాడా..? ప్రమాదమని తెలిసీ.....

  |

  నటుడిగా నారా రోహిత్ సూపర్ అనే చెప్పాలి కానీ నటన మీద ఉన్నశ్రద్ద ఫిజిక్ మీద పెట్టాల్సిన అవసరం మరీ కనిపిస్తోంది. ఆ ప్రభావమ్న్ జ్యో అచ్యుతానంద ల్లో మరీ స్పష్టంగా కనిపించింది. కెరీర్ ఆరంభంలో ఫిట్ గా కనిపించిన రోహిత్.. రెండు మూడేళ్లుగా లావుగా దర్శనమిస్తున్నాడు. ఈ మధ్య బరువు మరీ పెరిగిపోవడంతో ఈ విషయంలో చాలా కామెంట్లు పడ్డాయి. నటన కంటే ముందు ఆ ఓవర్ వెయిట్ మీదే మాట్లాడే వాళ్ళు పెరిగిపోయారు. దీంతో బరువు తగ్గబోతున్నట్లు ఆ మధ్య సంకేతాలిచ్చాడు రోహిత్. కానీ ఏమార్పూ కనిపించలేదు.

  ఆమధ్య వచ్చిన అసుర సినిమాలో పోలీస్ డ్రెస్ లో ప్రేక్షకులని కాస్త బయపెట్టిన నారా రోహిత్ కనీసం ఆ తర్వాత కూడా తన భారీ ఫిజిక్ లో ఎలాంటి చేంజ్ తేవటానికీ ప్రయత్నం చేయలేదు. లేదు. అసుర తర్వాత వచ్చిన తుంటరిలో అయితే అంత భారీ పర్సనాలిటితో డాన్స్ చూసినన ప్రేక్షకులకు కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది. నిజానికి మొదట్లో జూనియర్ ఎన్టీఆర్ బొద్దుగానే ఉన్నా అతని డాన్స్ విశయం లో మెచ్చుకున్న వాళ్ళే తప్ప నెగెటివ్ గా మాట్లాడిన వాళ్ళే లేదు.

  మొన్నా మధ్య వచ్చిన రాజా చెయ్యి వేస్తే లో ఏకంగా నెగిటివ్ పాయింట్స్ కింద నారా రోహిత్ పర్సనాలిటిని కూడా చెప్పారు విశ్లేషకులు. ఇక ఈ ఇబ్బంది జ్యో అచ్యుతానంద విషయంలో బాగా కనిపించింది. సినిమా చాలా బాగా నటించాడు. సినిమా బాగుంది..అంతా ఒకె. కానీ నారా రోహిత్ కదలికలు కాస్త భారీగా వున్నాయి అన్న కామెంట్ లు వినిపించాయి. పక్కనే నాగ శౌర్య మరీ ఈ విశయం లో డామినేటింగ్ గా కనిపించాడు.

  రోహిత్ బదులు నాని లాంటి యంగ్ హీరో అయి వుంటే, సినిమా ఇంకా డబుల్ సూపర్ హిట్ అన్న మాటలు వినిపించాయి. వినిపిస్తున్నాయి. దీనికి కారణ రోహిత్ నటన కాదు..ఫిజిక్ మాత్రమే. కదలడానికి చాలా ఇబ్బంది పడుతున్నట్లు సినిమాలో తెలిసిపోతోంది. ఇటీవల వరుసగా చేస్తున్న సినిమాలు వచ్చినవి వచ్చినట్లే పోతున్నాయి. అయితే ఫ్లాప్ ల బెడద అలా ఉండగా ఇంకా లావు తగ్గకపోవడంతో చూడటానికి ఇబ్బంది గానే ఉంది .

  లావు తగ్గుతాను అని చెబుతున్నాడు నారా రోహిత్ కానీ ఆచరణలో మాత్రం అది నిరూపించడం లేదు. గడచిన కొంత కాలంగా తన ఫిజిక్ ను కంట్రోల్ లో పెట్టుకోవాలి నారా రోహిత్ కిందా మీదా అవుతున్నారు. ట్రయినర్ ను పెట్టుకుని ట్రయ్ చేసారు. పది కిలోల వరకు తగ్గారు కూడా. రోహిత్ హీరోగా రంగప్రవేశం చేసినప్పుడు స్లిమ్ గానే ఉండేవాడు కానీ ఆ మద్య యాక్సిడెంట్ కావడంతో కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్లనేమో విపరీతమైన లావు అయ్యాడు. హీరో గా దూసుకు పోవాల్సిన ఈ ఏజ్ లో లావుగా మారడంతో స్క్రీన్ పై మరింత ముదురుగా కనిపిస్తున్నాడు.

  అయితే ఇలా తగ్గుతుంటే మళ్లీ అలా మారిపోతోంది ఫిజిక్ అని వినికిడి. దీంతో ఈ ట్రయినర్లు, జిమ్ లు ..సరిపోవు అని, ఏకంగా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుని, ఒకేసారి సూపర్ స్లిమ్ అండ్ యంగ్ హీరోగా మారిపోవాలని నారా రోహిత్ ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది.కానీ ఇలాంటి సర్జరీల వల్ల ఇబ్బంది పడిన సంఘటనలు చూస్తూనే ఉన్నాం. మరి రోహిత్ విశయం లో ఆ సర్జరీ సూట్ అవుతుందా, తర్వాత జీవితం లో దీనివల్ల ఇబ్బంది ఏం ఉండదా అన్న అనుమానాలు రావటం సహజం అందుకే ప్రస్తుతం ఎలాగూ అమెరికాలోనే వున్నాడు కాబట్టి, అసలు ఈ బేరియాట్రిక్ సర్జరీ మీద ఓ స్టడీ చేసి, ఆ పైన డెసిషన్ తీసుకుంటాడట మరి..

  English summary
  An Interesting buzz in Tollywood that Hero Nara Rohith To Undergo Bariatric Surgery.., Some of his fitness trainers have suggested him to undergo Bariatric Surgery. Rohith is still thinking the same and is yet to take a decision.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X