Pushpa 2 Item Song: పుష్ప 2లో శ్రీలీల.. పుష్పరాజ్‌తో కలిసి సమంతను మించేలా!
Pushpa 2 Item Song: ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ - సక్సెస్ పుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్ -1 ఏ రేంజ్‌లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ మూవీతో అల్లు అర్జున్ వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్ సంపాదించుకున్నారు. ఈ బస్టర్ మూవీకి సీక్వెల్‌గా వస్తోంది 'పుష్ప ది రైజ్'(Pushpa The Rise). ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఈగర్ గా వేయిట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో 'పుష్ప 2' సినిమాలోని ఐటమ్ సాంగ్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఐటెం సాంగ్ లో బాలీవుడ్ యంగ్ బ్యూటీ స్టెప్పులేయనున్నదంట. ఈ ఇంతకీ పుష్పరాజ్ తో చిందులేయనున్న హీరోయిన్ ఎవరంటే?
ఐటెం సాంగ్ అంటేనే హాట్ బ్యూటీస్ అందాల ఆరబోత. నాటుకోడి కూరలా ఘాటుగా ఉండే ఐటెం సాంగ్స్ కోసం మాస్ ఆడియన్స్ తెగ తహతహలాడుతారు. అందులోనూ ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ - సక్సెస్ పుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న మూవీ అంటే.. ఫ్యాన్స్ కు పునకాలే.. మాస్ ఆడియన్స్ కు జాతరే.. ఈ క్రేజీ కాంబినేషన్ వస్తున్న ఐటెం సాంగ్ అంటే.. అంచనాలు తార స్థాయికి చేరుకుంటాయి. ఆ సాంగ్ లో అల్లు అర్జున్ .. హాట్ హీరోయిన్స్ తో చిందులేస్తుంటే.. ఇక రచ్చ రంబోలనే. తాజాగా పుష్ప 2 ఐటమ్ సాంగ్ కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

మెయిన్ గా సుకుమార్ సినిమాలో స్పెషల్ సాంగ్స్‌కు స్పెషల్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పటివరకూ ఆయన తెరకెక్కించిన ఆర్య సినిమాలో 'అ అంటే అమలాపురం', ఆర్య 2 మూవీలో 'రింగ రింగా', నాగ చైతన్య 100% లవ్ సినిమాలో 'డియ్యాలో డియ్యాల', రామ్ చరణ్ 'రంగస్థలం' మూవీలో 'జిగేలు రాణి' వంటి పాటలు ఆ సినిమాలను బాస్టర్లుగా మార్చేశాయి.
ఇక 'పుష్ప1'లోని వచ్చిన 'ఊ అంటావా మావ' గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అనిపిస్తోంది. ఐటెం సాంగ్ లో సమంతతో స్టెప్పులేయడం.. ఆ గాట్స్ కేవలం సుకుమార్ కే దక్కుతోంది. హాట్ లుక్‌లో సమంత దించులేసి.. అందర్నీ అట్రాక్ట్ చేసింది. మూవీలో సమంత రూత్ ప్రభు సెప్పులేయడానికి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుందట. ఈ పాట కారణంగానే పుష్ప 1 ప్రమోషన్స్ చేయకపోయినా హిందీ వర్షన్ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి,సూపర్ హిట్‌గా నిలిచిందని టాక్. ఈ సాంగ్ పై ఎంతో మంది సెలబ్రెటీలు కూడా సెప్పులేసిన విషయం తెలిసిందే.
ఇక 'పుష్ప ది రూల్'( Pushpa 2)లో కూడా అదేస్థాయిలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని ఇప్పటికే మూవీ గతంలోనే ప్రకటించింది. ఈ సాంగ్ లో ఎవరు స్టెప్పులేస్తున్నారనేది ఆసక్తిగా మారింది. ఈ పాటలో బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్, 'యానిమల్' ఫేమ్ త్రుప్తి డిమ్రిలతోపాటు పలువురు హాట్ బ్యూటీస్ పేర్లు కూడా వినిపించాయి. కేవలం 4 నిమిషాల సాంగ్ నటించడానికి దాదాపు 10 కోట్ల వరకు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఏ బ్యూటీ కూడా పుష్ప 2 టీమ్‌లో భాగం కాలేకపోయారని సమాచారం.

ఈ తరుణంలో పుష్ప మూవీ యూనిట్.. బాలీవుడ్ భామలను సైడ్ చేసి, టాలీవుడ్ బ్యూటీ శ్రీలీలను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈమేరకు జరుగుతోన్న ప్రచారంపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ డ్యాన్సర్లలో శ్రీలీల ఒక్కరు. బన్నీ, శ్రీలీల కలిసి స్టెప్పులు వేస్తే థియేటర్లు దద్దరిల్లిపోవడం పక్కా అనుకుంటున్నారు.
ఇక శ్రీలీల విషయానికి వస్తే.. 'గుంటూర్ కారం' మూవీ తర్వాత ప్రస్తుతం నితిన్‌తో 'రాబిన్‌హుడ్' అనే సినిమా చేస్తోంది. రవితేజ 75వ సినిమాలోనూ శ్రీలీలనే హీరోయిన్. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'సినిమాలో కూడా ఈ అమ్మడే హీరోయిన్. ఈ సాంగ్ లో సెట్ అయితే.. ఈ బ్యూటీకి టాలీవుడ్ లో తిరుగు ఉందని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











