మెగా ఫ్యామిలీకి కోడలు కాబోతున్న హీరోయిన్ .. సీక్రెట్‌గా ఇంత కథ నడిచిందా?
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు భారతీయ చిత్ర పరిశ్రమలో తమతో పాటు నటించిన నటీనటులను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉదంతాలు ఎన్నో. నేటికీ ఈ తంతు కొనసాగుతూనే ఉంది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ హవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి వేసిన పునాదులపై దాదాపు డజను మంది హీరోలు టాలీవుడ్‌ను దున్నేస్తున్నారు. ఈ కుటుంబంలో పలువురు ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ లిస్ట్‌లోకి మరో హీరో కూడా రాబోతున్నాడట. ఈ వివరాల్లోకి వెళితే..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం లేదని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. అయితే కొందరు మాత్రం దీనికి అతీతం. ఈ కోవలోకే వస్తారు అచ్చ తెలుగు అమ్మాయి రీతూ వర్మ. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేనప్పటికీ అన ప్రతిభతో ఈ స్థాయికి చేరుకున్నారు రీతూ. కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించిన ఆమె.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గానూ రాణించారు. రీతూ టాలెంట్‌ను గుర్తించిన సినీ ప్రముఖులు ఆమెకు పలు సహాయ పాత్రలు ఇచ్చారు.

హీరోలు, హీరోయిన్లకు ఫ్రెండ్‌గా, అక్క, చెల్లి వంటి క్యారెక్టర్లలో రీతూ వర్మ నటించారు. ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ నటించిన బాద్ షాలో హీరోయిన్‌గా చెల్లెలిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రీతూ వర్మ.. తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన పెళ్లి చూపులతో బ్రేక్ అందుకుంది. ఈ సినిమాలో నటనకు గాను ఏకంగా నంది అవార్డ్ సహా పలు పురస్కారాలను దక్కించుకున్నారు రీతూ వర్మ.
అనంతరం కేశవ, టక్ జగదీష్, వరుడు కావలెను, ఒకే ఒక జీవితం, కణం, స్వాగ్ వంటి చిత్రాల్లో నటించారు రీతూ. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ అదృష్టం పరీక్షించుకున్న ఆమె.. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ధనుష్, దుల్కర్ సల్మాన్ , విశాల్ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు. ప్రస్తుతం తెలుగులో మజాకా, తమిళ్‌లో ధ్రువ నచ్చత్రం చాప్టర్ 1లో రీతూ వర్మ నటిస్తున్నారు.

స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోవాలనే లక్ష్యంతో వేగంగా అడుగులు వేస్తున్న రీతూ వర్మకు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఆమె పెళ్లి గురించే. మెగా ఇంటి కోడలిగా త్వరలో రీతూ అడుగుపెట్టనున్నారని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు.. మెగా ఫ్యామిలీలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఖచ్చితంగా రీతూ కనిపిస్తుంది. అంత పెద్ద ఫ్యామిలీతో ఆమెకు ఆ రేంజ్‌లో రిలేషన్స్ ఎలా వచ్చాయా అని అంతా ఆశ్చర్యపోతున్నారు.
అయితే రీతూ ఓ మెగా హీరోను ప్రేమించిందని.. అందుకే ఆ కుటుంబంలో జరిగే వేడుకలకు వెళ్తుంటుందని ఆమె ప్రేమను రెండు కుటుంబాలు ఒప్పుకున్నాయని అంటున్నారు. అయితే ఇప్పటికే మెగా ఫ్యామిలీలోని అందరు హీరోలకు పెళ్లిళ్లు అయిపోయాయి. సాయితేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ మాత్రమే బ్యాచిలర్స్‌గా ఉన్నారు. వీరిలో ఎవరినైనా రీతూ ప్రేమించారా అన్న చర్చ జరుగుతోంది. మరి రీతూ మనసులో ఉన్నది ఎవరో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











