43 ఏళ్లకి పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ బ్యూటీ ? ఆ హీరో టార్చర్ వల్లే ఇలా..

రోజుకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. అందం, అభినయం, టాలెంటే కాదు.. కాసింత అదృష్టం కూడా కలిసి రావాలి. అలా అన్ని కలిసి వస్తే ఆఫర్స్ దక్కుతాయి. ఈ క్రమంలో నటించిన మూవీకి సక్సెస్ టాక్ వస్తేనే స్టార్ హీరోయిన్ గా రాణించగలరు. అయినా మేల్ డామినేషన్ ఉండే ఈ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కొన్నాళ్లు మాత్రమే. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా కాస్త సేఫ్ అవుట్ అయితే ఫేడ్ అవుట్ అవ్వాల్సిందే. అందుకు 40 ఏండ్లు పైబడినా స్టార్ హీరోయిన్స్ పెళ్లి చేసుకోవడం లేదు. కానీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాత్రం పెళ్లికి సిద్దమైందట. 43 ఏళ్ల వయస్సులో పెళ్లి పీటలెక్కబోతున్నది. ఇంతకీ ఆ స్టార్ టాలీవుడ్ బ్యూటీ ఎవరు? మీరో లూక్కేయండి.

ఆ టాలీవుడ్ స్టార్ బ్యూటీ ఎవరో కాదు. ప్రముఖ సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి. ఈ అమ్మడు క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అందం, అభినయం, నటన, డాన్స్ తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అప్పట్లో టాలీవుడ్ సినీ పరిశ్రలో ఓ ఊపు ఊపింది. అతితక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. ఈ అమ్మడు ఆల్మోస్ట్ అందరి హీరోల సరసన నటించి టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. అనుష్క శెట్టి తన కెరీర్ లో రవితేజ, గోపిచంద్, ప్రభాస్, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

Is Tollywood star heroine anushka shetty marrying businessman

అనుష్క నటించిన సినిమాలకు ఇప్పటికి ఫుల్ క్రేజ్ ఉంటుంది. వేశ్య పాత్రలో కూడా నటించి మెప్పు పొందింది. ఏకంగా ఈ బ్యూటీ నటనకు ఉత్తమ నటిగా రెండవ ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. అలాగే స్వీటీ, పంచాక్షరి, ఖలేజా, నాగవల్లి, రగడ, కేడీ, తకిట తకిట, సింగం, చింతకాయల రవి, మిర్చి, బాహుబలి వంటి చిత్రాల్లో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా బ్లాక్ బస్టర్ సినిమా బాహుబలితో అనుష్క తన పూర్తి టాలెంట్ ను బయట పెట్టింది. ఈ మూవీలో అనుష్క నటనకు ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. తర్వాత నిశ్శబ్దం, సైజ్ జీరో, భాగమతి సినిమాల్లో నటించింది. సైజ్ జీరో మూవీ తర్వాత అనుష్క సినీ పరిశ్రమకు కాస్త దూరంగా ఉంది. అనూహ్యంగా బరువు కూడా పెరిగింది. ఇక గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటింది. ఇందులో నవీన్ పోలిశెట్టి కీలక పాత్రలో నటించాడు.

లేకపోతే.. అనుష్క శెట్టి పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గానే నిలుస్తాయి. ఎప్పుడు అనుష్క పెళ్లి చేసుకుంటుందా? అని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ భామ పెళ్లి చూడాలని ఆశిస్తున్నారు. ఈ తాజాగా అనుష్క శెట్టి పెళ్లి గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. సోషల్ మీడియా టాక్ ప్రకారం అనుష్క ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతుందట. అంతే కాదండోయ్ వీరి పెళ్లికి ఇద్దరి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారట. ఈ వార్త ఎంత వరకు వాస్తవమూ తెలియదు కానీ.. సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు కొడుతున్నాయి.

Is Tollywood star heroine anushka shetty marrying businessman

ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అండ్ అనుష్క ప్రేమలో ఉన్నారని నెత్తింట వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. పైగా వీరి కాంబినేషన్ మూవీస్ అంటే ఇష్టపడే సినిమా లవర్స్ అనుష్క, ప్రభాస్ వివాహం చేసుకుంటే చూడాలని ఎంతో ఆశ పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ మీ ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చు కదా అన్న అంటూ సోష ల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మరీ అనుష్క - ప్రభాస్ సడన్ ట్విస్ట్ ఇవ్వనున్నారా? లేక నిజంగానే అనుష్క వ్యాపారవేత్తను వివాహం చేసుకుంటుందా? తెలియాలంటే కొన్ని డేట్ వెయిట్ చేయాల్సిందే. లేక ఈ వార్తలపై బ్యూటీ అనుష్క శెట్టి స్పందించాల్సిందే. అప్పుడే సోషల్ మీడియాలో వార్తలపై క్లారిటీ వస్తుంది.

More from Filmibeat

Read more about: anushka shetty prabhas tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X