Divorce: భార్యతో శర్వానంద్ విడాకులు? డైవోర్స్‌కు కారణం ఏంటో తెలుసా?
సినీ ప్రపంచంలో ప్రస్తుతం సెలబ్రెటీలు తమ వ్యక్తిగత విషయాల్లో షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా విడాకుల విషయంలో ఒకటి తర్వాత మరొకరు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే యంగ్ హీరోలు తమ లైఫ్ పార్ట్నర్స్ ను వెతికే క్రమంలో బ్రేకప్ లు కూడా జరుపుకుంటున్నారు. కాగా పెళ్లయిన వారు తమ భాగస్వామితో ఊహించిన విధంగా విడిపోతూ తమ అభిమానులను, సినీ లోకాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నారు. ఎంతో ప్రేమగా ఇష్టపడి పెళ్లి చేసుకున్న నటీనటులు వివాహ బంధంలో కలిసి ముందుకు నడవలేక పోతున్నారు.
ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఊహించని విధంగా తమ భాగస్వాములకు విడాకులు ఇచ్చి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. టాప్ హీరోలు సైతం తమ పార్ట్నర్స్ తో కలిసి జీవితాన్ని పంచుకోలేమంటూ విడాకుల దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక తాజాగా టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగిన శర్వానంద్ కూడా ఇదే బాటలో పయనిస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన భాగస్వామిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయన ఇప్పుడు ఆమెకు దూరంగా కూడా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి.

2023లో ఎంతో ఘనంగా పెళ్లి పీటలెక్కిన ఆ స్టార్ హీరో శర్వానంద్ ఇప్పుడు ఊహించిన విధంగా విడాకుల దిశగా పయనిస్తున్నారంటూ సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు, యూత్ కు ఎంతో దగ్గరైనా ఆ నటుడు 2 సంవత్సరాల క్రితం రక్షితారెడ్డిని పెళ్లి చేసుకున్నారు. ఆయన పెళ్లి రాజస్థాన్లోని జైపూర్ లో గల ది లీలా ప్యాలస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహానికి సినీ తారలే కాకుండా, సీఎం, పొలిటికల్ లీడర్స్ కూడా హాజరై దీవించారు. రెండేళ్ల పాటు వీరి వివాహ బంధం ఎంతో చక్కగా సాగింది. భవిష్యత్తులో కూడా అంతే అన్యోన్యంగా ఉంటారని అంతా భావించారు.
వారికి 18 నెలల కింద పండంటి ఆడబిడ్డ కూడా జన్మనిచ్చింది. దాంతో ఆ స్టార్ తండ్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇలా ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతారని అనుకుంటే ఇప్పుడు వీరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఏకంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారంటూ సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీంట్లో వాస్తవం ఎంత ఉందనేది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ సోషల్ మీడియాలో వచ్చిన రూమర్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి. గతంలోనూ చాలా వరకు నిజమయ్యాయి కూడాను. ఇలాంటి సమయంలో ఆ నటుడు గురించి వార్తలు రావడం ఆయన శ్రేయోభిలాషులకు జీర్ణించుకోలేని స్థితిని మిగిల్చింది.
ఈ క్రమంలో ఆ టాలీవుడ్ స్టార్ నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారా అనేది రోజురోజుకు చర్చ పెరుగుతూ వస్తుంది. అయితే కొద్దికాలంగా వారిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకొన్నాయి. వాటిని పరిష్కరించుకొలేనంతగా విభేదాలు పెరిగిపోయాయి. దాంతో శర్వానంద్, భార్య రక్షితారెడ్డి ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. వారిద్దరూ సపరేట్‌గా జీవిస్తున్నారు. ప్రస్తుతం రెండు కుటుంబాల మధ్య చర్చ జరుగుతున్నది అని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కానీ కూతురు ఉన్న కారణంగా అభిమానులు మాత్రం ఇలాంటివి జరగకుండా వారిద్దరు అన్యోన్యంగా సాగిపోవాలని, జీవితంలో చిన్న చిన్న సమస్యలు సర్వసాధారణమని, ఏదేమైనా కలిసే ఉండాలని ఆశిస్తున్నారు. మున్ముందు ఏం జరుగుతుందని వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











