యువ హీరోయిన్‌తో మ్యూజిక్ డైరెక్టర్ పెళ్లి! రిలేషన్‌షిప్‌లో ఉన్న యువ సెలబ్రిటీలు ఎవరంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో పెళ్లిళ్ల వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో సమంతతో రాజ్ నిడిమోరు, రష్మికతో విజయ్ దేవరకొండ వివాహాలు అభిమానులకు సంతోషాన్ని కలిగించాయి. అయితే తాజాగా మ్యారేజ్ రేసులోకి బెల్లంకొండ శ్రీను రావడం తెలిసిందే. ఇటీవల తాను ప్రేమలో ఉన్న కావ్యరెడ్డితో ఎంగేజ్‌మెంట్ చేసుకొన్న విషయం తెలిసిందే. ఈ వార్తలు ఇలా క్రేజీగా మారిన నేపథ్యంలో మరో వార్త తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నది. అయితే ఈసారి ఓ యువ మ్యూజిక్ డైరెక్టర్, యువ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం మీడియాలో విస్తృతంంగా ప్రచారం అవుతున్నది. అయితే ఆ ఇద్దరు యంగ్ సెలబ్రిటీలు ఎవరనే విషయానికి వస్తే..
టాలీవుడ్‌లో రాణిస్తున్న యువ మ్యూజిక్ డైరెక్టర్ పెళ్లికి సిద్దమవుతున్నాడు. ఈ యువ సెలబ్రిటీకి ఫేమస్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉంది. తండ్రి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు ఉన్న వ్యక్తి. బాబాయ్ వరల్డ్ ఫేమస్ డైరెక్టర్. ఈయన ఇటీవల కాలంలో మీడియం రేంజ్ సినిమాలను తన మ్యూజిక్ ప్రతిభతో హిట్ సినిమాలుగా మారుస్తున్నారు. అలాంటి యువ సంగీత దర్శకుడు తెలుగు హీరోయిన్‌తో ప్రేమలో పడ్డారు. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

ఇక తెలుగు హీరోయిన్ విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో తన ఫెర్ఫార్మెన్స్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకుొన్నది. తనకంటూ ఇమేజ్, గుర్తింపు తెచ్చుకొంటున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌తో కలిగిన పరిచయం వారిద్దరిని సన్నిహితంగా చేసింది. ఆ బంధం కాస్త ప్రేమగా మారింది. ఇటీవల కాలంలో వారిద్దరు తమ స్నేహితులతో కలిసి పార్టీల పేరుతో షికారు చేస్తున్నారు అనే విషయం మీడియాలో హాట్ టాపిక్ అయింది.
గత కొద్దికాలంగా ఇద్దరి మధ్య ప్రేమాయణం జరుగుతున్నా.. మీడియాకు, పబ్లిక్ దృష్టికి రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఇటీవల తమ రిలేషన్‌షిప్ గురించి వారు పెద్దల దృష్టికి తీసుకెళ్లగా రెండు కుటుంబాలు కూడా సానుకూలంగా స్పందించాయి. దాంతో త్వరలోనే పెళ్లికి సంబంధించిన నిర్ణయం జరుగబోతున్నది అనే విషయం మీడియాలో ప్రచారం అవుతున్నది.
ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో ఈ వార్తకు నెటిజన్లు తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు. అయితే ఆ మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ అని, యువ హీరోయిన్ చాందీని చౌదరీ అంటూ మ్యారేజ్ అనే వార్తకు సంబంధించిన పోస్టుల కింద కామెంట్ చేస్తున్నారు. అయితే వారిద్దరి మధ్య ఈ బంధం కొనసాగుతుందా? ఈ పెళ్లి వార్తలో నిజం ఎంత? తమ రిలేషన్‌షిప్ గురించి వస్తున్న ఈ వార్తపై వారు స్పందిస్తారా? తమ అఫైర్‌ను, పెళ్లి వార్తను అధికారికంగా ధృవీకరిస్తారా? అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











