స్టార్ కపుల్ కాపురంలో యంగ్ హీరోయిన్ చిచ్చు!
ఇండస్ట్రీ అంటేనే రూమర్స్. హీరో హీరోయిన్ ఎక్కడైనా బయట కనిపిస్తే చాలు.. వారి మధ్య ఏదో ఉందని చెప్పుకొస్తారు. ఇక సినిమాలో ఇంటిమేటెడ్ సీన్స్ చేసిన జంట మధ్య రిలేషన్ ఉందని రూమర్స్ క్రియేట్ చేయడం కొత్తేమి కాదు. తాజాగా ఇలాంటి రూమర్స్ నే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌ను వెంటాడుతున్నాయి. అందుకు కారణం యంగ్ హీరోయిన్ ఆయన ఇంటి పక్కనే ఇంటిని కొనుక్కోవడమే. దాంతో హీరోకు దగ్గరయ్యారనే వార్త మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఆ వార్త వివరాల్లోకి వెళితే..
గతేడాది యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రణబీర్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం రణబీర్ కపూర్ సరసన రష్మిక మందన్న నటించగా.. స్పెషల్ సీన్స్ లో త్రిప్తి డిమ్రి నటించింది. ఇక ఈ సినిమాలో రణబీర్ కు, త్రిప్తి కు మధ్య జరిగే ఇంటిమేటెడ్ సీన్స్ ఎంత హైలైట్ గా నిలిచాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

రష్మికను బాబీ 1 అని, త్రిప్తి ని బాబీ 2 అని పిలవడం మొదలుపెట్టారు అభిమానులు. ఈ సినిమాతో ఈ చిన్నది నేషనల్ వైడ్ స్టార్ గా మారిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాతో బిజీగా ఉన్న త్రిప్తి .. తాజాగా ముంబైలోని రిచెస్ట్ ఏరియా బాంద్రాలో బంగ్లా కొనుగోలు చేసింది. 247 గజాల విస్తీర్ణంలో ఉన్న రెండు అంతస్థుల భవనాన్ని 14 కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిందని తెలుస్తోంది. అది కూడా రణబీర్ ఇంటి పక్కనే అంట.
ఇప్పటికే ఈ ఇంటికి సంబంధించి స్టాంప్ డ్యూటీ కింద రూ. 70 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. 30 వేలు కూడా చెల్లిందని సమాచారం. ఇక్కడవరకు బాగానే ఉన్నా.. త్రిప్తి ఇల్లు కొనడం వెనుక రణబీర్ హస్తం ఉందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. యానిమల్ సినిమా తరువాత నుంచి ఈ జంట బయట కూడా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు అనేది టాక్.

అంతేకాకుండా వీరిద్దరి మధ్య బంధం.. రణబీర్ అలియా కు మధ్య విడాకులు తీసుకొచ్చే ప్రమాదం కూడా ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు పక్క పక్కనే ఉండడంతో.. అలియాకు అనుమానాలు వచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అయితే ఇంకొంతమంది మాత్రం ఇదంతా సిల్లీ గాసిప్స్ అని చెప్పుకొస్తున్నారు. బాంద్రాలో ఇల్లు కొన్నంత మాత్రానా.. రిలేషన్ పెట్టుకోవడానికి వచ్చిందని అనుకోవడం ఎందుకు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అది కేవలం రణబీర్ మాత్రమే ఉండే ఏరియా కాదు. అక్కడే బాలీవుడ్ స్టార్ హీరోలు అయిన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఉంటారు. మరి వారితో నటిస్తే.. వారితో ఎఫైర్ అంటారా.. ? అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ ను కుదిపేస్తోంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ప్రస్తుతం త్రిప్తి విక్కీ విద్యా కో వాలా వీడియో చిత్రంతో పాటుగా భూల్ భులయా 3, ధడక్ 2, బ్యాడ్ న్యూస్ చిత్రాల్లో నటిస్తోంది. మరి ఈ సినిమాలతో ఈ చిన్నది ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











