Tripti Dimri యానిమల్ హీరోయిన్‌కు బంపర్ ఆఫర్.. బ్లాక్‌బస్టర్ సీక్వెల్‌లో కుర్ర హీరోతో ఛాన్స్!
సందీప్ రెడ్డి వంగా, రణ్‌బీర్ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన యానిమల్ మూవీ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత తృప్తి డిమ్రీకి భారీ ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఈ సినిమాలో జోయాగా అందాల ఆరబోస్తూ హాట్ హాట్‌గా నటించిన ఈ ముద్దు గుమ్మ కోసం యువ హీరోలు క్యూ కడుతున్నట్టు సమాచారం. యానిమల్ మూవీకి ముందు ఎవరికి తెలియనీ ఈ గ్లామర్ డాల్ ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ స్టార్‌గా మారిపోయింది. తాజాగా ఈ అందాల భామకు లభించిన భారీ ఆఫర్ విషయంలోకి వెళితే..
యానిమల్ సినిమాలో తృప్తి డ్రిమ్రీ పాత్ర అతిథి పాత్ర అయినప్పటికీ.. ఆ సినిమాపైన, అలాగే ప్రేక్షకులపై భారీ ప్రభావం చూపింది. కేవలం గ్లామర్ మాత్రమే కాకుండా ఫెర్ఫార్మెన్స్‌తో సినీ విమర్శకులతోపాటు సాధారణ ప్రేక్షకులను కూడా మెప్పించింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత తృప్తికి ప్రశంసలే కాకుండా భారీ ఆఫర్లను నిర్మాతలు ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇక హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ ఇండస్ట్రీల నుంచి స్ట్రాంగ్ క్యారెక్టర్లతోపాటు మంచి రెమ్యునరేషన్స్‌తో రోల్స్ ఆఫర్ చేస్తున్నారనే వార్తలు మీడియాలో కనిపిస్తున్నాయి. అలాగే తెలుగులో రవితేజ మూవీలోను, అలాగే ఎన్టీఆర్ మూవీలో కూడా ఆమె నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన మీడియాలో కనిపించలేదు.
ఇదిలా ఉండగా, బాలీవుడ్‌లో భారీ విజయం అందుకొన్న ఆషికి, దానికి ఫ్రాంచైజీగా వచ్చిన ఆషికీ 2 సినిమాలు భారీ విజయాలు అందుకొన్నాయి. విజయాలతోపాటు మ్యూజిక్ పరంగా సంగీత అభిమానులను ఆకట్టుకొన్నది. అలాంటి సినిమాకు ఫ్రాంచైజీగా ఆషికీ 3 సినిమాను తెరకెక్కించేందుకు సిద్దమవుతున్నారు. ఈ సినిమాలో తృప్తి డిమ్రీకి ఎమోషనల్ పాత్రలో నటించాలనే ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తున్నది.

ఆషికీ 3 సినిమాలో బాలీవుడు కుర్ర హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నారని, ఆయన పక్కన తృప్తిని నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇంకా చర్చల దశలోనే ఈ వ్యవహారం ఉంది. యానిమల్ హీరోయిన్ ఈ సినిమాను ఒప్పుకొంటుందా? లేదా అనే అంశంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది.

తృప్తి డిమ్రీ కెరీర్ విషయానికి వస్తే.. శ్రీదేవీ నటించిన మామ్ సినిమా ద్వారా 2017లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పోస్టర్ బాయ్స్, లైలా మజ్ను, బుల్ బుల్, కళ, యానిమల్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం మేరే మెమబూబ్ మేరే సనమ్ అనే సినిమాలో నటిస్తున్నది. ఇదే కాకుండా టెలివిజన్‌పై నాగిన్ సీరియల్‌లో కూడా మెరిసింది.


Click it and Unblock the Notifications











