ఆ స్టార్ హీరోతో త్రిష బంధం నిజమేనా? .. కీర్తి సురేష్ పెళ్లితో వెలుగులోకి
రీసెంట్‌గా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గర పలువురు స్టార్స్‌కి సంబంధించి కొన్ని ఊహించని కాంట్రవర్సీలు ఏ రేంజ్‌లో హైలైట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ ఇష్యూలలో కోలీవుడ్ నుంచి కూడా కనిపించాయి. అక్కడి నుంచి స్టార్ హీరో అండ్ హీరోయిన్స్ ధనుష్, నయనతారల కాంట్రవర్సీ పెద్ద ఎత్తున దుమారం రేపింది. మరి ఈ ఇష్యూలోనే వీరిద్దరికి ఇండస్ట్రీ నుంచి విడివిడిగా సపోర్ట్ చేయడం అనేది కూడా వైరల్ గా మారింది.
ధనుష్‌కి శింబు ఇతరులు సపోర్ట్‌గా నిలిస్తే నయనతారకి త్రిష తదితరులు సపోర్ట్ గా కనిపించారు. మరి ఈ హీట్ తర్వాత మరోసారి స్టార్ హీరోయిన్ త్రిష ఇపుడు మళ్ళీ హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. 42 ఏళ్ల త్రిష కృష్ణన్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు అని అందరికీ తెలిసిందే. కానీ ఆమె విషయంలో మాత్రం పలు పుకార్లు ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ హీరోతో సీక్రెట్ బంధం ఉంది అనే మాట ఎప్పటి నుంచో ఉంది.

మరి ఆ హీరో ఎవరో కాదు దళపతి విజయ్ అని కూడా పలు పుకార్లు ఉన్నాయి. ఇందుకు సాక్ష్యంగా పలు సందర్భాల్లో ఇద్దరూ కలిసి తిరిగిన ప్రదేశాలు, త్రిష విజయ్ కలిసి ప్రయాణాలు చేయడం వంటి వాటితో తమిళ ప్రేక్షకుల్లో కొన్ని అనుమానాలు అయితే ఎప్పుడు నుంచో ఉన్నాయి. కొద్దినెలల కితమే వీరి వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో వైరల్ అవుతోంది.

ఇపుడు మరోసారి విజయ్ అండ్ త్రిష పేర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కోలీవుడ్ యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి గోవాలో జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ పెళ్ళికి విజయ్ కూడా హాజరయ్యాడు. తాను వెళ్లిన కొన్ని పిక్స్ కూడా బయటికొచ్చాయి. కానీ త్రిష కూడా ఈ పెళ్ళికి వెళ్ళింది అని చాలా మందికి తెలీదట. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిపై కొన్ని పిక్స్ ఇపుడు ఎయిర్‌పోర్ట్ నుంచి వైరల్ అవుతున్నాయి.
పైగా ప్రయాణికుల జాబితాలో విజయ్ పేరు తర్వాతే త్రిష పేరు కూడా ఉన్న పేపర్ షీట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనితో మరోసారి ఈ ఇద్దరి మేటర్ మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే విజయ్ అండ్ త్రిష కాంబినేషన్ లో పలు హిట్ చిత్రాలు ఉన్నాయి. రీసెంట్ గానే విజయ్ నటించిన "ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం"లో కూడా విజయ్ కోసం త్రిష ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత తమిళ్ లో అజిత్ సరసన ఓ సినిమా, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన "విశ్వంభర" అనే మూవీలో త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.


Click it and Unblock the Notifications











