రాజకీయాల్లోకి త్రిషా కృష్ణన్.. చెన్నై నుంచి అసెంబ్లీకి పోటీ?
తమిళనాడులోనే కాకుండా దక్షిణాది సినీ, రాజకీయ రంగాల్లో విజయ్, సంగీత విడాకుల వ్యవహారం భారీ దుమారం రేపుతున్నది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిజీగా ఉన్న సమయంలో సీక్రెట్‌గా కోర్టులో ఉండాల్సిన డైవోర్స్ అఫిడవిట్స్ సోషల్ మీడియాలో లీక్ కావడం అత్యంత వివాదాస్పదంగా మారింది. ఈ లీక్ వ్యవహారం హీరోయిన్ త్రిషను ఈ వివాదంలోకి లాగేలా చేసింది. దాంతో తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో త్రిషా కృష్ణన్ ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారింది. అయితే తాజాగా ఆమె గురించి వైరల్ అవుతున్న రూమర్ల విషయానికి వస్తే..
విజయ్‌పై భార్య సంగీత తీవ్రమై ఆరోపణలు చేస్తూ.. ఓ హీరోయిన్ కారణంగా మా దాంపత్య జీవితం విచ్చినమైంది. కొన్నేళ్లుగా నా భర్తకు హీరోయిన్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఆ హీరోయిన్‌కు దూరంగా ఉంటానని మాట ఇచ్చాడు. కానీ ఆ మాటను నిలుపుకోలేకపోయాడు. దాంతో నేను మానసిక క్షోభకు గురయ్యాను. ఆయనతో వైవాహిక జీవితాన్ని కొనసాగించలేను. కాబట్టి మాకు విడాకులు ఇప్పించండి అంటూ సంగీత తన డైవోర్స్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

అయితే డైవోర్స్ పిటిషన్ వ్యవహారం గురించి లీక్ అయిన తర్వాత విజయ్, త్రిషల వివాహేతర బంధం గురించి మీడియాలో భారీగా చర్చ జరిగింది. అయితే గతంలో వారిద్దరూ కలిసి విదేశాల్లో విహార యాత్రలు చేయడంతో అప్పుడే వారి మధ్య రిలేషన్ గురించి రకరకాల ఊహాగానాలు, గుసగుసలు వినిపించాయి.
ఈ క్రమంలో విజయ్, త్రిష ఏజీఎస్ సంస్థ కుటుంబంలో జరిగిన వివాహానికి ఇద్దరు కలిసి రావడంతో అనేక రూమర్లకు చెక్ పెట్టారు. తమ మధ్య ఉన్న అనుబంధాన్ని అఫీషియల్ చేశారు. ఒకేసారి అన్ని రకాల ఊహాగానాలకు తెర దించారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో మరో రూమర్ వైరల్ అవుతున్నది. త్వరలోనే ఆమె టీవీకే పార్టీలోకి చేరి రాజకీయ ప్రవేశం చేయనున్నారు అనే వార్త క్రేజీగా మారింది.
అయితే త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో త్రిషా కృష్ణన్ పోటీ చేయనున్నారు. చెన్నైలోని ఓ కీలక నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారు అనే వార్త ట్రెండ్ అవుతున్నది. అయితే ఈ విషయంపై టీవీకే పార్టీ నుంచి అధికారిక ప్రకటన లేకపోవడంతో ఇది రూమర్‌గానే మిగిలిపోతుందా? లేక వాస్తవం అవుతుందా? అనేది చర్చ జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











