For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పెళ్లికూతురు కాబోతున్న త్రిష.. వివాదాస్పద తమిళ హీరోతో మ్యారేజ్!

  |

  అందాల నటి త్రిషా కృష్ణన్ రెండు దశాబ్దాలుగా ఎదురులేకుండా కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు. వయసు పెరిగినా వన్నె తరుగని అందంతో యంగ్ హీరోయిన్లకు పోటీగా నిలుస్తున్నారు. కెరీర్ పరంగా గతేడాది మంచి సక్సెస్‌లను సొంతం చేసుకొన్నారు. అయితే సక్సెస్‌లతో పాటు వివాదాలు కూడా అదే జోరులో ఆమె చుట్టుముట్టిన సందర్బాలు ఉన్నాయి. త్రిషా జీవితంపై ఎన్నో రూమర్లు వచ్చిన చెక్కు చెదరని ధైర్యంతో ఘాటుగా స్పందిస్తుంటారు. అలాంటి త్రిషా పెళ్లికి సంబంధించి తమిళ సినీ పరిశ్రమలో ఓ వార్త వైరల్‌గా మారింది. అదేమిటంటే..

  రానాతో అఫైర్ అంటూ

  రానాతో అఫైర్ అంటూ

  గతంలో త్రిషా అఫైర్లు, డేటింగ్స్, పెళ్లి గురించి రకరకాల వార్తలు వినిపించాయి. ముఖ్యంగా రానా దగ్గుబాటితో ఎప్పటి నుంచో అఫైర్ ఉందనేది అందరికీ తెలిసిందే. రానా కూడా త్రిషతో తన అఫైర్ ఉండేదని, ఆ తర్వాత లవ్‌కు పుల్‌స్టాప్ పెట్టి ఫ్రెండ్స్‌గానే ఉండాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. రానా, త్రిషా బాల్య స్నేహితులనే విషయం విదితమే. అలా రానాతో అఫైర్‌ ఇటీవల వరకు కొనసాగిందనే వాదన సినీ వర్గాల్లో వినిపించింది.

  త్రిషా ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్

  త్రిషా ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్

  2015లో త్రిషాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తన బాయ్‌ఫ్రెండ్ వరుణ్ మణియన్‌తో నిశ్చితార్థం జరగడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. చాలా సీక్రెట్‌గా జరిగిన ఎంగేజ్‌మెంట్ కొద్ది రోజుల్లోనే బ్రేకప్ అవ్వడం అందర్నీ షాక్ గురిచేసింది. ఆ తర్వాత రానా కారణంగానే ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ జరిగిందనే వార్తలు వచ్చినా అదంతా గాసిప్ గానే నిలిచిపోయింది. రానా ఎంగేజ్‌మెంట్ జరగడంతో వారి మధ్య అఫైర్ వార్తలకు బ్రేకులు పడ్డాయి.

  రానా నిశ్చితార్థంతో

  రానా నిశ్చితార్థంతో

  రానా వివాహం మిహికా బజాజ్‌తో జరుగుతున్న క్రమంలో త్రిషా కూడా లాక్‌డౌన్ తర్వాత పెళ్లికి సిద్ధమవుతున్నట్టు ఓ వార్త కోలీవుడ్‌లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. అయితే వివాదాస్పద తమిళ హీరో శింబును వివాహం చేసుకొంటున్నారే వార్త మరింత క్రేజ్‌ను పెంచింది. ఎందుకంటే శింబుకు గతంలో నయనతార, హన్సికతో బ్రేకప్‌లు ఉన్న సంగతి తెలిసిందే.

  సింగిలే కానీ అంటూ త్రిష

  సింగిలే కానీ అంటూ త్రిష

  ఇటీవల ఓ ప్రశ్నకు త్రిష నర్మగర్భంగా చెప్పిన సమాధానం విపరీత అర్థాలకు దారి తీసింది. నేను సింగిల్ గానే ఉన్నాను. కానీ నా బంధాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను అంటూ తన రిలేషన్‌షిప్ స్టాటస్ గురించి చెప్పడం గమనార్హం. అయితే ఇటీవల త్రిషా, శింబు సన్నిహితంగా ఉండటంతో ఆ రూమర్లకు బలాన్ని ఇస్తున్నాయి. అదే కాకుండా శింబు పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నారనే వార్త త్రిషా వివాహ వార్తకు కనెక్ట్ అవుతున్నదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  Rana Daggubati-Miheeka Bajaj’s Wedding Not Postponed
  త్రిషా, శింబు కలిసి

  త్రిషా, శింబు కలిసి


  త్రిషా, శింబు తమిళంలో కొన్ని సినిమాల్లో నటించారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏ మాయ చేశావో తమిళ వెర్షన్‌లో ఇద్దరు కలిసి నటించారు. ఆ సినిమాలో నటించిన సమంత, అక్కినేని నాగచైతన్య ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం తెలిసిందే. ఒకవేళ త్రిషా, శింబు పెళ్లి చేసుకొంటే ఆ సినిమా వీళ్ల జీవితాల్లో మ్యాజిక్ సృష్టించనట్టే. ఇప్పుడు గౌతమ్ మీనన్ ఆ సినిమాకు రూపొందించే సీక్వెల్‌లో త్రిష, శింబు నటిస్తున్నారు.

  English summary
  South Indian star Trisha Krishnan affairs always crazy in media. Before Rana engagement, Trisha was in the affiar gossips with Rana. Reports suggest that, Trisha is going to to get married to a hero Simbu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X