విజయ్‌తో రిలేషన్‌షిప్.. త్రిషా కృష్ణన్ సంచలన నిర్ణయం

దక్షిణాది మీడియాతోపాటు జాతీయ మీడియాలోనే కాకుండా సోషల్ మీడియాలో సీనియర్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ హాట్ టాపిక్‌గా మారింది. తమిళ సూపర్ స్టార్ విజయ్‌తో రిలేషన్‌షిప్ కారణంగా గత కొద్ది నెలల నుంచి ఆమెకు సంబంధించిన వార్తలు మీడియా హెడ్‌లైన్లను ఆకర్షిస్తున్నాయి. అయితే ఆమె వ్యక్తిగత జీవితం, ప్రొఫెషనల్ లైఫ్ గురించిన అనేక ఊహాగానాలు పెద్ద ఎత్తున్న వస్తున్నాయి. ఈ క్రమంలో తమిళ రంగానికి చెందిన సినీ క్రిటిక్ త్రిష గురించి సంచలన విషయాన్ని వెల్లడించింది. త్రిష తీసుకొన్న నిర్ణయం అంటూ ఆమె వెల్లడించింది. త్రిష తీసుకొన్న వ్యక్తిగత నిర్ణయం ఏమిటనే వివరాల్లోకి వెళితే..

త్రిషా ప్రొఫెషనల్ కెరీర్ విషయానికి వస్తే.. 1999 సంవత్సరంలో జోడి అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆమె కెరీర్ పరంగా వెనక్కి చూసుకోలేదు. వరుస విజయాలతో ఆమె కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకొంటూ అగ్ర హీరోలందరితో జతకట్టింది. గత 27 ఏళ్లుగా దక్షిణాదిలో ఎదురులేని హీరోయిన్‌గా, అత్యధికంగా పారితోషికం తీసుకొనే తారగా ఘనతను సాధించింది. సుమారుగా 3 దశాబ్దాల కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తన అధిపత్యాన్ని చాటుకొంటున్నారు.

Trisha Krishnan good bye to acting

తన కెరీర్ గ్రాఫ్‌ పెంచుకొంటూ వెళ్లిన త్రిషను పలువురు హీరోలతో ఆఫైర్లు వెంటాడాయి. కానీ సూపర్ స్టార్ విజయ్‌తో బంధం ఆమెకు ప్రత్యేకంగా మారిందనే విషయం మీడియాలో వచ్చిన కథనాలు స్పష్టం చేశాయి. అయితే విజయ్‌తో తన బంధాన్ని నేరుగా చెప్పకపోయినా.. వారిద్దరి వ్యవహారం అధికారికంగా స్పష్టత నిచ్చాయి. అయితే విజయ్ వ్యక్తిగత జీవితంలోకి మాత్రమే కాకుండా పొలిటికల్ లైఫ్‌లో కూడా కీలక పాత్రను పోషించనున్నారనే వార్తలు అభిమానులకు సంతోషాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాయి.

అయితే త్రిషా యాక్టింగ్ కెరీర్ గురించి తమిళ మీడియాలో సంచలన కథనాలు వెలువడుతున్నాయి. కోలీవుడ్ సినిమాకు చెందిన చిత్రా లక్ష్మణన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా రంగం నుంచి త్రిషా తప్పుకోనున్నారు. ఆమె యాక్టింగ్‌కు గుడ్ బై చెప్పబోతున్నారు. ఇక ముందు సినిమాల్లో నటించకూడదనే నిర్ణయం తీసుకొన్నారు అని ఆయన వెల్లడించారు.

అయితే చిత్రా లక్ష్మణన్ కామెంట్స్ తమిళ సినిమా పరిశ్రమలో వైరల్ అయ్యాయి. అయితే తన ప్రొఫెషనల్ కెరీర్ గురించి వస్తున్న వార్తలపై డైరెక్టుగా త్రిషా స్పందించలేదు. కానీ తాను ఏ సినిమాకు సైన్ చేయలేదు. కొత్త ప్రాజెక్టులకు ఓకే చెప్పలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. కానీ నటనకు గుడ్ బై చెప్పే విషయంపై ఆమె సస్పెన్స్ కొనసాగించే విధంగా నర్మగర్బంగా కామెంట్ చేశారు. దాంతో త్వరలోనే ఆమె సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు సంకేతాలు ఇచ్చారు అంటూ తమిళ సినీ క్రిటిక్స్ కామెంట్ చేస్తున్నారు.

త్రిషా కెరీర్ విషయానికి వస్తే.. విజయ్‌తో కలిసి లియో, గోట్ చిత్రాల్లో నటించిన తర్వాత.. అజిత్‌తో కలిసి విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ, థగ్ లైఫ్ చిత్రాల్లో నటించింది. సూర్యతో కరుప్పు, చిరంజీవితో విశ్వంభర, మలయాళ చిత్రం రామ్‌లో సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో కలిసి నటిస్తున్నారు.

Read more about: trisha krishnan vijay kollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X