Thalapathy67 మూవీ నుంచి త్రిషా తప్పుకొందా? అతడితో విభేదాలతో షూటింగ్ నుంచి బయటకు! అసలేం జరిగిందంటే?
వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇళయ దళపతి విజయ్ మరో సినిమాతో రెడీ అయ్యారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో Thalapathy67 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తుడటం అభిమానులను సంతోషానికి గురిచేసింది. అయితే క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా లోకేష్‌తో పోట్లాడి సినిమా నుంచి తప్పుకొన్నారనే వార్త మీడియాలో హల్ చల్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో విజయ్ సినిమా నుంచి తప్పుకొన్నాదా? అనే విషయంలోకి వెళితే..

విజయ్ లియోలో సంజయ్ దత్
విజయ్ నటిస్తున్న Thalapathy67 సినిమా లియో గ్రాండ్‌గా ఇటీవల మొదలైంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, మిస్కిన్, గౌతమ్ మీనన్, లాంటి నటులు ఈ సినిమాలో నటిస్తున్నారనే విషయం ఆసక్తిని రేపింది. అంతేకాకుండా త్రిష హీరోయిన్ అనే సరికి అభిమానులకు గిల్లిలో సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గుర్తుకు వచ్చింది.

14 ఏళ్ల తర్వాత విజయ్‌తో త్రిష
విజయ్‌తో 14 ఏళ్ల క్రితం త్రిష జతకట్టింది. గిల్లి సినిమాలో నటించిన తర్వాత నుంచి ఈ కాంబినేషన్ రిపీట్ కాలేదు. అయితే వీరిద్దరి కాంబినేషన్ ఎప్పుడెప్పుడా అనే ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు లోకేష్ కనకరాజ్ శుభవార్తను అందించాడు. ఇటీవల పూజా కార్యక్రమానికి త్రిష కూడా రావడంతో ఆ వార్త కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత విజయ్‌తోపాటు త్రిష కాశ్మీర్ షూటింగ్‌కు వెళ్లింది.

లోకేష్ కనగరాజ్‌తో గొడవ పడి
అయితే Thalapathy67 సినిమా షూటింగులో లోకేష్ కనకరాజ్‌తో త్రిషకు విభేదాలు తలెత్తాయని, వాతావరణం పడటం లేదనే కారణంతో సినిమా నుంచి తప్పుకొన్నదనే విషయం మీడియాలో వైరల్ అయింది. అంతేకాకుండా చెన్నై ఎయిర్‌పోర్టులో త్రిష కనిపించిన ఫోటో అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు.

త్రిష తల్లి క్లారిటీ ఇచ్చిందేమిటంటే?
విజయ్ సినిమా నుంచి త్రిష తప్పుకొన్నదనే వార్త మీడియాలో ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో ఆమె తల్లి ఉమ కృష్ణన్ స్పందించారు. త్రిష గురించి వస్తున్న వార్తలో ఎలాంటి వాస్తవం లేదు. విజయ్ సినిమా నుంచి తప్పుకొన్నారనే వార్తలో నిజం లేదు. ఆమె ప్రస్తుతం కాశ్మీర్ షూటింగులోను ఉన్నారు. ఇలాంటి వార్తలను నమ్మకండి అని ఉమ కృష్ణన్ అన్నారు.

త్రిషా సినిమా కెరీర్ ఇలా
త్రిష సినిమా కెరీర్ విషయానికి వస్తే.. దాదాపు 20 సినిమా కెరీర్‌ను ఇంకా జోష్‌తో కొనసాగిస్తున్నారు. ఇటీవల రిలీజైన రంగీ సినిమాలో వన్ ఉమెన్ ఆర్మీగా కనిపించింది. అలాగే వరుస చిత్రాలతోపాటు.. హీరోయిన్ ఓరియెంట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇంకా పలు ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











