అకిరా లాంచ్ కోసం పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్.. పవన్ కల్యాణ్ ఛాయిస్ ఎవరికంటే?
సినిమా ఇండస్ట్రీలో స్టార్ వారసుల ఎంట్రీ అంటే సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఓవైపు నందమూరి బాలయ్య తనడు తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్త నందమూరి ఫ్యాన్స్ ను హుషారెత్తిస్తోంది. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ సినిమా ఎంట్రీ గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం అకిరాను ఇండస్ట్రీలోకి లాంచ్ చేయడానికి ఇద్దరు బడా నిర్మాతలు పోటీ పడుతున్నట్టుగా సమాచారం. మరి ఆ నిర్మాతలు ఎవరో ఒక లుక్కేద్దాం పదండి.
ప్రస్తుతం పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిన పవన్ కళ్యాణ్ సినిమాలకు మరికొంత గ్యాప్ ఇవ్వబోతున్నారు. ఇటీవలే డిప్యూటీ సిఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన పవన్ మరో మూడు నెలలు ప్రజలతో మమేకమై ఆ తర్వాత సినిమాలకు రెండు లేదా మూడు రోజులు మాత్రమే కేటాయిస్తానని చెప్పేశారు. దీంతో ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యాక ఆయన పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటారా ? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఒకవేళ అదే గనక నిజమైతే ఆ గ్యాప్ ను పూరించగలిగేది ఆయన వారసుడు అకిరా నందన్ మాత్రమే. ఇప్పటికే ఇండస్ట్రీలో ఒక క్రికెట్ టీం అంత మెగా హీరోలు ఉన్నప్పటికీ ఆయన స్థానాన్ని వారసుడు తప్ప ఎవ్వరూ భర్తీ చేయలేరు అనేది మెగా ఫ్యాన్స్ మాట. అందుకే పవన్ పెద్ద కొడుకు అకిరా నందన్ ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఇన్నాళ్లు చదువుపై దృష్టి పెట్టిన అకీరా రీసెంట్ గా కాస్త ఎక్కువగానే బయట కనిపిస్తున్నాడు. ఎన్నికల తర్వాత తండ్రి పవన్ కళ్యాణ్ విజయాన్ని ఆయనతో కలిసి సెలెబ్రేట్ చేసుకోవడం, చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ వంటి రాజకీయ నేతలతో సంభాషించడం వంటివి చేసి ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించాడు.

కాగా ఇటీవల ఫిల్మ్ స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన ఈ కొణిదెల వారసుడు సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ ను ఏ మార్గంలో ఎంచుకోవాలనుకుంటున్నాడు అన్నది ఇంకా క్లారిటీ లేదు. నటుడిగా ఎంట్రీ ఇస్తాడా లేదా నిర్మాతగా మారతాడా అనేది తెలియాల్సి ఉంది. అయితే పవర్ స్టార్ వారసుడిగా అకిరా తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, స్టార్ గా ఎదిగితే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ అంతకంటే ముందే రేణు దేశాయ్ అతనికి నటనపై ఆసక్తి లేదని స్టేట్మెంట్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ఇద్దరు బడా నిర్మాతలు డివివి దానయ్య, ఏఎమ్ రత్నం అకిరా నందన్ ను వెండితెరపై లాంచ్ చేయడానికి పోటీ పడుతున్నారు అనే వార్త ఫిలిం నగర్ సర్కిల్స్ లో వైరల్ అవుతుంది. అయితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తుది నిర్ణయం మాత్రం తండ్రి పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉంది. మరి సినిమా రంగంలోకి అకిరా ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











