రంగస్థలంకు సీక్వెలా? వైష్ణవ్ తేజ్ భారీ సాహసమే చేస్తున్నాడట.. మెగాహీరోలకు షాకిచ్చేలా!

Recommended Video

Vaishnav Tej Movie Is A Sequel To Rangasthalam ? | Filmibeat Telugu

చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు బుచ్చిబాబు సన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం జనవరి 21న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇంకా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలువురు ప్రముఖులు వైష్ణవ్ తేజ్‌ను ఆశీర్వదించారు.

గ్రామీణ నేపథ్యంతో తొలిసినిమా

గ్రామీణ నేపథ్యంతో తొలిసినిమా

వైష్ణవ్ తేజ్ తొలి సినిమా గ్రామీణ కథా నేపథ్యంతో పక్కా మాస్ చిత్రంగా ఈ సినిమా రూపొందుతున్నది. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయగా అందులో వైష్ణవ్ తేజ్ జాలరిగా నటిస్తున్నట్టు అర్ధమైంది. అయితే పోస్టర్‌ను చూడగానే రంగస్థలం సినిమా పోస్టర్‌ను చూసినట్టే అనిపించింది. అయితే రంగస్థలం సినిమాకు ఇది సీక్వెల్‌ అనే మాట వినిపిస్తున్నది.

రూమర్‌కు బలం ఆ కారణం

రూమర్‌కు బలం ఆ కారణం

వైష్ణవ్ తేజ్ సినిమాకు కథ, కథనాలు సుకుమార్ రైటింగ్ బ్యానర్ నుంచే రావడంతో రంగస్థలం సినిమాకు సీక్వెల్ అనే రూమర్‌కు బలం చేకూరింది. ఈ సినిమాను రంగస్థలం మూవీని రూపొందించిన మైత్రీ మూవీస్ నిర్మించడం ఆ వార్తలకు బలం చేకూరుతున్నది. దీంతో సుకుమార్, మైత్రీ బ్యానర్‌కు రంగస్థలంపై మక్కువ ఇంకా పోలేదనిదని మరోసారి స్పష్టమైంది.

తొలి సినిమాలో డీ గ్లామర్‌ రోల్‌లో

తొలి సినిమాలో డీ గ్లామర్‌ రోల్‌లో

మెగా హీరోలు అంటే మాస్ హీరోలు. ఇప్పటి వరకు చాలా మంది మాస్ కమర్షియల్స్‌తోనే అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. అయితే ఇక వైష్ణవ్ తేజ్ తన తొలి సినిమాకే డీగ్లామర్ రోల్‌లో కనిపించడంతో పెద్ద సాహసం, ప్రయోగం చేస్తున్నారనే మాట వినిపిస్తున్నది. ఏది ఏమైనా మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ కావడం కంటే యాక్టర్‌గా ఫెర్ఫార్మర్‌గా కనిపించాలనుకోవడం మంచిదే అంటున్నారు.

ఎనర్జిటిక్‌గా, లుక్‌పరంగా

ఎనర్జిటిక్‌గా, లుక్‌పరంగా

టాలీవుడ్‌లో ఎనిమిదో హీరోగా రంగ ప్రవేశం చేసిన వైష్ణవ్ తేజ్ ఫిజికల్‌గా కొంత ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. లుక్‌పరంగా ఆదిలోనే ఆకట్టుకొన్నారు. ఇక తెరపై ఎలా రాణిస్తారో అనేది వేచి చూడాల్సిందే. గ్రామీణ నేపథ్యంగా రూపొందే ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తి చేసి వెంటనే సెట్స్ పైకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నది మైత్రీ మూవీస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X