ఆమెకి విజయ్ బ్రేకప్ చెప్పబోతున్నాడా? కారణం ఇదేనా?
ప్రస్తుతం టాలీవుడ్ దగ్గర ఉన్నటువంటి యంగ్ జనరేషన్‌లో యూత్‌ని ఊపేస్తున్న హీరో హీరోయిన్స్ లో టాలెంటెడ్ నటీనటులు రష్మిక మందన్నా అలాగే విజయ్ దేవరకొండలు కూడా ఒకరు. ఈ ఇద్దరూ కెరీర్‌లో సెటిల్ అయ్యి టాలీవుడ్‌లో మంచి ఫేమ్‌ని సాధించారు. అంతే కాకుండా చాలా తక్కువ సమయం లోనే పాన్ ఇండియా ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు.
అయితే ఈ ఇద్దరి కలయికలో పలు సినిమాలు కూడా వచ్చాయి కానీ ఊహించని విధంగా ఈ సినిమాలతోనే ఈ ఇద్దరూ ఒకటయ్యే పరిస్థితులు వచ్చాయి. ఇలా ఈ యంగ్ జంట రిలేషన్‌లో ఉన్నట్టుగా ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. తమ బంధం బయటపెట్టనప్పటికీ ఇద్దరూ ఇన్ డైరెక్ట్‌గా హింట్ ఇచ్చేస్తున్నారు. మెయిన్ గా రష్మిక సైడ్ నుంచే ఎక్కువ కామెంట్స్ వినిపించడం జరిగేది.

అలాగే ఈ ఇద్దరు వేర్వేరుగా ఫోటోలు పెట్టినప్పటికీ ఒకే లొకేషన్‌లో ఇద్దరూ ఉండటం అనేది వారు లవ్ లో ఉన్నారని చెప్పకనే చెప్పినట్లు అయ్యింది. ఈ నేపథ్యంలో అంతా సాఫీగా జరుగుతుంది అనుకున్న సమయంలో క్రేజీ రూమర్ ఇపుడు వైరల్ అవుతోంది. దీంతో ఇద్దరు కూడా బ్రేకప్ చెప్పుకోబోతున్నారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముందుగా అయితే బ్రేకప్ ప్రపోజల్ విజయ్ సైడ్ నుంచే ఉండబోతుంది అన్నట్టుగా ఆ న్యూస్ సారాంశం.
ఇందుకు కారణం ఏంటి అనేది కూడా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. నిజానికి ఇద్దరూ తమ సినిమాలతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నారు కానీ ఇక్కడ హిట్స్ కూడా మేటర్ లోకి వస్తాయి. ఇపుడు విజయ్ కంటే రష్మిక వరుస హిట్స్ అందులోనూ విజయ్ తన కెరీర్‌లో చూడని నెంబర్స్ ఉన్న సినిమాల్లో రష్మిక దూసుకెళ్తోంది.

దీనితో తనకంటే ఎక్కువగా రష్మిక హిట్స్ కొట్టడం ఎక్కువ ఫేమ్ తెచ్చుకోవడంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటూ పలు షాకింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ మరోపక్క ఇద్దరూ మాత్రం బయట బాగానే చెట్టాపట్టాలు ఏసుకుని తిరుగుతున్నట్టు కనిపిస్తున్నారు. సో రష్మికకి విజయ్ బ్రేకప్ చెబుతున్నాడు అనే వార్తల్లో దాదాపు నిజం లేదని ఫిలింనగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
అలాగే రీసెంట్ గానే విజయ్ తన పెళ్లి గురించి చేసిన పోస్ట్ ఒకటి వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇలా తన విషయంలో మాత్రం కొంచెం పరిస్థితులు తేడాగా కనిపిస్తున్నాయి. మరి చూడాలి నిజంగా ఈ జంట పెళ్లిపీటల వరకు వెళుతుందా? లేక మధ్యలోనే విడిపోతుందా అనేది. ప్రస్తుతం రష్మిక మందన్నా... పుష్ప 2 సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకోగా విజయ్ దేవరకొండ హిట్ కొట్టాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











