Don't Miss!
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విరాట్ కోహ్లీ మాజీ ప్రేయసితో విజయ దేవరకొండ డేటింగ్.. మీడియాలో రచ్చ రచ్చ!
Recommended Video
అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ వరుస హిట్లతోనే కాదు.. సీరియల్ డేటింగ్ వ్యవహారాలతో కూడా దూసుకెళ్లున్నాడు. డియర్ కామ్రేడ్‌తో రిలీజ్‌కు సిద్ధమవుతూనే మరో సినిమాను చకచకా పూర్తి చేస్తేస్తున్నాడు. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్లో కేఎస్ రామారావు నిర్మించే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్న ఈ హీరోకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకు ఆ వార్త ఏమిటంటే..
బ్రెజిల్ బ్యూటీతో విజయ్ దేవరకొండ
క్రాంతి మాధవ్ రూపొందిస్తున్న చిత్రంలో బ్రెజిల్ బ్యూటీ ఇజాబెల్లె లీట్ హీరోయిన్గా నటిస్తున్నది. ఈ ముద్దుగుమ్మతో విజయ దేవరకొండ సన్నిహితంగా ఉంటున్నట్టు ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో లీక్ అయిన ఫోటో ఈ రూమర్లకు మరింత బలం చేకూర్చింది. తాజా సెల్ఫీ ఫొటో డేటింగ్ రూమర్లకు ఇంకాస్త నిప్పు రాజేసింది.
రూమర్లకు సెగపెట్టిన సెల్ఫీ ఫోటో
బ్రెజిల్ బ్యూటీ ఇజాబెల్లె లీట్ షేర్ చేసిన ఫొటోలో విజయ్ దేవరకొండ జోష్‌గా కనిపించాడు. వారిద్దరూ నాలుక బయటపెట్టి సెల్ఫీకి ఫొజిచ్చారు. రౌడీ లాంటి హీరో నాకు సహ నటుడిగా ఉండటం నిజంగా నా అదృష్టం అంటూ ఫోటోను షేర్ చేసింది. అయితే తన సినిమాలో నటించే హీరోయిన్లతో డేటింగ్ చేస్తున్నాడనే విషయం విజయ్ దేవరకొండకు సర్వసాధారణంగా మారింది.
విజయ్ దేవరకొండ అసలు కథ అదేనంట!
ఇక క్రాంతి మాధవ్ సినిమా విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ, బ్రెజిల్ బ్యూటీ ఇజాబెల్లె లీట్ ఇద్దరూ ఫ్రాన్స్‌లో సెటిల్ అయిన దంపతులుగా నటిస్తున్నారనేది తాజా సమాచారం. ఫ్యాష్ బ్యాక్‌లో వారి లవ్ లైఫ్ గురించి, విజయ్‌తో ఇతర అమ్మాయిలకు అఫైర్లతో సినిమా ముందుకు సాగుతుందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇదిలా ఉండగా, భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రెడ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం జూలై 26న రిలీజ్ కానున్నది.
విరాట్ కోహ్లీతో ఇజాబెల్లే డేటింగ్ వార్తలు
ఇక బ్రెజిల్ బ్యూటీ ఇజాబెల్లె లీట్ విషయానికి వస్తే బాలీవుడ్లో పురానీ జీన్స్ అనే చిత్రంలో నటించింది. కొద్దికాలం భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో సన్నిహితంగా ఉంది. కొద్దికాలం డేటింగ్ తర్వాత వారిద్దరూ తమ రిలేషన్‌కు బ్రేకప్ చెప్పడంతో ఆ కథ అక్కడితే ముగిసిపోయింది. అప్పటి నుంచి ఈ బ్యూటీ కెరీర్‌పైనే దృష్టిపెట్టింది.