మెగాస్టార్ టైటిల్‌తో విజయ్ దేవరకొండ డేరింగ్.. నెక్ట్స్ మూవీ స్టోరి అదేనట!
Recommended Video
సూపర్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ ఎంపిక చేసుకొనే చిత్రాల కథలు వేటికి అవే భిన్నంగా ఉంటాయనేది అందరికి తెలిసిందే. అర్జున్ రెడ్డిలో డ్రగ్ ఎడిక్ట్‌గా, గీతా గోవిందంలో అమాయకమైన ప్రేమికుడిగా, నోటాలో యుక్త వయసులోనే సీఎంగా, టాక్సీవాలాలో నిరుద్యోగ యువకుడిగా ఇలా వెరైటీ పాత్రల్లో కనిపించారు. ఇక త్వరలో విడుదల కానున్న డియర్ కామ్రేడ్‌లో స్టూడెంట్ లీడర్‌గా నటిస్తున్నాడు. తాజాగా పట్టాలెక్కిన హీరో చిత్రం బ్యాక్ డ్రాప్ చాలా ఆసక్తికరంగా ఉందనే విషయం ఫ్యాన్స్‌కు మరింత కిక్ ఇస్తున్నది. గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా టైటిల్‌తో వస్తున్న హీరో సినిమా కథా నేపథ్యం ఏమిటంటే..

హీరో చిత్రం గురించి
డియర్ కామ్రేడ్ సినిమాను రిలీజ్‌కు సిద్ధం చేస్తూనే దర్శకుడు క్రాంతి మాధవ్ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే మైత్రీ మూవీస్ రూపొందించే హీరో సినిమాను పట్టాలెక్కించాడు. శనివారం జరిగిన ముహుర్తం షాట్‌కు కొరటాల శివ, హీరోయిన్ మాళవిక మోహనన్ తదితరులు హాజరయ్యారు. అత్యంత నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, మాళవికపై తొలిషాట్‌కు కొరటాల శివ క్లాప్ కొట్టారు.

స్పోర్ట్స్ అండ్ మ్యూజికల్ థ్రిల్లర్‌గా
ఇక హీరో సినిమా కథా నేపథ్యం మ్యూజిక్ థ్రిల్లర్ అని తెలిసింది. అలాగే మ్యూజిక్‌తోపాటు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో కిక్కెంచే సబ్జెక్ట్‌ను దర్శకుడు ఆనంద్ అన్నామలై రెడీ చేసినట్టు సమాచారం. గతంలో అర్జున్ రెడ్డిలో కాసేపు ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఏ రకమైన స్పోర్ట్స్‌ను బ్యాక్‌డ్రాప్‌గా తీసుకొన్నారనేది ఆసక్తికరంగా మారింది.

బాలీవుడ్ ఎంట్రీపై దృష్టి
ఇక సౌత్ ఇండస్ట్రీలోకి మెల్ల మెల్లగా అడుగుపెడుతూనే బాలీవుడ్‌పై కూడా దృష్టిపెట్టారు. ఇటీవల ముంబైలో విజయ్ దేవరకొండ కనిపించడం రకరకాల వార్తలకు చోటిచ్చింది. బాలీవుడ్ సినిమా గురించి చర్చించేందుకే ముంబై వెళ్లాడనేది విస్తృతంగా ప్రచారమైంది. అయితే దానిపై ఎలాంటి వివరణ బయటకు రాకపోవడంతో అది గాసిప్‌గానే మిగిలిపోయింది.

హీరోయిన్ మాళవిక మోహనన్ గురించి
హీరో సినిమా కోసం విజయ్ దేవరకొండ సరసన మాళవిక మోహనన్ నటించడం అందర్ని ఓ రకమైన షాక్ గురించేసింది. ముంబైలో పుట్టి పెరిగిన మాళవిక మోహనన్‌కు తెలుగులో తొలి అవకాశం. గతంలో బాలీవుడ్ నటుడు ఇషాన్ కట్టర్‌తో బియాండ్ ది క్లౌడ్స్ అనే చిత్రంలో నటించింది. మలయాళ, కన్నడ, తమిళ చిత్రాల్లో నటించింది. రీసెంట్‌గా రజనీకాంత్ పేట్ట చిత్రంలో నటించి ఆకట్టుకొన్నది.


Click it and Unblock the Notifications











