లవర్‌తో విజయ్ దేవరకొండ హీరోయిన్ బ్రేకప్.. 6 నెలల సహజీవనం ఫలితం అదేనా!
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సినిమా రికార్డులు వినిపించడం తగ్గి.. బ్రేకప్స్, అఫైర్స్ వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ముఖ్యంగా హిందీ సినీ పరిశ్రమలో ప్రేమాయణాలు, అలాగే విడిపోవడాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన విజయ్ దేవరకొండ హీరోయిన్ అఫర్‌పై ఓ క్లారిటీ వచ్చేసింది. అయితే ఆమె తన ప్రియుడు, స్టార్ హీరోతో తెగతెంపులు చేసుకొన్నదనే విషయంపై సాక్ష్యాలు కూడా దొరికాయి. ఎవరా హీరోయిన్, ఆమె బ్రేకప్ గురించి చెప్పిన ప్రముఖుడు ఎవరంటే..
విజయ్ దేవరకొండ హీరోయిన్ అంటే.. రష్మిక మందన్న తర్వాత అనన్య పాండే గుర్తుకు వస్తుంది. వారిద్దరూ లైగర్ సినిమాలో నటించి.. చూడముచ్చట జంటగా పేరు తెచ్చుకొన్నారు. అయితే లైగర్ సినిమాపై గంపెడు ఆశలు పెట్టుకొన్న అనన్యకు ఆ సినిమా తీవ్ర నిరాశలో ముంచెత్తింది. అప్పటి నుంచి సరైన సినిమా కోసం ఎదురు చూస్తున్నది.

అయితే లైగర్ సినిమా షూటింగ్ సమయం నుంచి అనన్య పాండే బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో ప్రేమాయణం నడుపుతున్నది. వారిద్దరూ కలిసి పలుచోట్ల చిలకా గోరింకల్లా కనిపించారు. అయితే వారిద్దరూ ఎప్పడూ కూడా తమ అఫైర్, డేటింగ్ వ్యవహారంపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటవేస్తూ వస్తున్నారు.
అయితే అనన్య, ఆదిత్యకు అతి సన్నిహితుడైనా ఓ నటుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. వారిద్దరూ నెల క్రితమే విడిపోయారు. బ్రేకప్ తర్వాత వారిద్దరూ ఎవరివారు తమ జీవితాలను కొనసాగిస్తున్నారు. ఈ వార్త మాకు చాలా హార్ట్ టచింగ్, బ్రేకింగ్ అనిపించడమే కాకుండా బాధ కలిగించింది. వారిద్దరూ మంచి వాతావరణంలో విడిపోవాలని నిర్ణయం తీసుకొన్నారు అని చెప్పారు.

అయితే ఆదిత్య రాయ్ కపూర్‌తో బ్రేకప్ తర్వాత ఆమె తన కెరీర్‌పై దృష్టిపెట్టారు. బ్రేకప్ బాధ నుంచి తేరుకొని వర్కవుట్స్, జిమ్‌కు వెళ్తూ మీడియా కెమెరాలకు చిక్కారు. ఆమె ఇంతకు ముందు మాదిరిగా హుషారుగా కనిపించకపోవడంతో ఆమె ఇంకా ఆ విషాదం నుంచి పూర్తిగా బయటకు రాలేదని ఆమె సన్నిహితులు తెలియజేస్తున్నారు.
అనన్య పాండే కెరీర్ విషయానికి వస్తే.. లైగర్ సినిమా తర్వాత ఖో గయే హమ్ అనే చిత్రంలో నటించారు. ప్రస్తుతం కాల్ మీ బే అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నది. కంట్రోల్, బ్యాటిల్ థై సీడ్స్, దర్బార్, శంకరా, ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సీ శంకరన్ నాయర్, రన్ ఫర్ యంగ్ అనే సినిమాల్లో నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











