ప్రముఖ నటితో వీకే నరేష్ నాలుగో పెళ్లి?.. వీడియో వైరల్ కావడంతో మీడియాలో రచ్చ!
ప్రముఖ నటుడు వీకే నరేష్ మరోసారి వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది సంవత్సరాలుగా వీకే నరేష్ ప్రముఖ నటితో సహజీవనం చేస్తున్నారనే వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. అయితే కొద్ది రోజులుగా నరేష్ పెళ్లి వార్త వెబ్ మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించింది. అత్యంత ప్రాధాన్యం సంతరించుకొన్న ఈ పెళ్లి వార్త గురించిన వివరాల్లోకి వెళితే..

వీకే నరేష్ ప్రొఫెషనల్ లైఫ్
ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల కుమారుడిగా సుపరిచితుడైన వీకే నరేష్ 80వ దశకంలో హీరోగా యూత్‌ను విశేషంగా ఆకర్షించారు. ఆయన నటించిన నాలుగు స్తంభాలాట, శ్రీవారికి ప్రేమలేఖ లాంటి సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి ఎన్నో భావోద్వేగమైన పాత్రలతో ఆకట్టుకొన్నారు.

నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకొని..
వీకే నరేష్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. అన్నీ ఒడిదుడుకులే. గతంలో ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకొన్నారు. భార్యలతో వ్యక్తిగత విభేదాల కారణంగా ఆయన విడాకులు తీసుకొన్నారు. అయితే ప్రస్తుతం ప్రముఖ నటి పవిత్రా లోకేష్‌తో సహజీవనం చేస్తున్నట్టు మీడియాలో అడపదడపా వార్తలు కనిపించాయి. అంతేకాకుండా వారిద్దరూ కలిసి భార్యాభర్తలుగా నటిస్తూ మంచి జంటగా పేరు తెచ్చుకొన్నారు.

పవిత్ర లోకేష్‌తో సహజీవనం
ఇక కన్నడ సినిమా రంగంలో ప్రముఖ నటిగా పేరు తెచ్చుకొన్న పవిత్రా లోకేష్ ప్రస్తుతం తెలుగులో బిజీ ఆర్టిస్టుగా మారిపోయారు. తెలుగులో దాదాపు స్థిరపడిపోయారు. అయితే కన్నడ సినిమా ప్రముఖుడు, భర్త సుచేంద్ర ప్రసాద్ విభేదాల కారణంగా ఒంటరిగానే జీవిస్తున్నారు. అయితే చట్టబద్దంగా విడాకులు తీసుకోలేదనేది తాజా సమాచారం. అయితే కొద్ది నెలల క్రితం లోకేష్, నరేష్ మనసులు కలవడంతో వారిద్దరి కలిసి ఉంటున్నట్టు తెలిసింది.

మహాబలేశ్వర్ పర్యటనతో
ఇదిలా ఉండగా, వీకే నరేష్, పవిత్ర లోకేష్ ఇద్దరు సహజీవనానికి స్వస్తి చెప్పి వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. అయితే ఇటీవల మహాబలేశ్వర్‌లోని స్వామిజీని ఇద్దరు కలిసి దర్శించుకొన్న వీడియో మీడియాలో వైరల్ అయింది. ఇద్దరు అన్యోన్యంగా స్వామీజి ఆశీర్వాదం తీసుకొంటూ వీడియోలో కనిపించారు. దాంతో వారిద్దరూ పెళ్లి చేసుకొంటున్నట్టు మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది.

త్వరలోనే వీకే నరేష్ పెళ్లి?
అయితే తల్లి మరణంతో ఒంటరిగా మారిన వీకే నరేష్ ప్రస్తుతం తోడు కోరుకొంటున్నారని, అందుకే తన మనసుకు నచ్చిన పవిత్రా లోకేష్‌ను పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు. పవిత్ర లోకేష్‌కు అధికారికంగా విడాకులు లభించగానే.. పెళ్లికి ముహుర్తాలు పెట్టుకోవాలనుకొంటున్నట్టు సమాచారం. అయితే ఈ వార్తపై వీకే నరేష్ గానీ, పవిత్ర లోకేష్ గానీ స్పందించకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











