ఆ హీరోయిన్‌తో వాషింగ్టన్ సుందర్ డేటింగ్? హోటల్‌‌లో రెడ్‌ హ్యాండెడ్‌గా..

ఇండియాలో క్రికెట్‌కు, సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెటర్లను, సినీతారలను భారతీయులు దేవుళ్లు లాగా కొలుస్తారు. ఇక క్రికెటర్లను పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎందరో. నాటి షర్మిళా ఠాగూర్ - మన్సూర్ అలీఖాన్ పటౌడీ నుంచి నేటి విరాట్ కోహ్లీ - అనుష్మ శర్మ వరకు ఈ లిస్ట్ చాలా పెద్దది. పెళ్లిళ్లే కాదు.. క్రికెటర్లతో ఎఫైర్లు, ప్రేమాయణాలు సాగించిన ముద్దుగుమ్మల లిస్ట్ భారీగా ఉంది. భారతీయ క్రికెటర్లే కాదు.. విదేశీ క్రికెటర్లతో డేటింగ్ చేసి బడ్డల్ని కన్నవారూ ఉన్నారు. క్రికెటర్లు- హీరోయిన్ల ఎఫైర్స్ గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గాసిప్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఇటీవలి కాలంలో టీమిండియా క్రికెటర్ హర్డిక్ పాండ్యా తరచుగా హీరోయిన్లతో ఎఫైర్స్, బ్రేకప్స్‌తో వార్తలలో నిలుస్తున్నాడు. రెండ్రోజుల క్రితం మృణాల్ ఠాకూర్‌తో స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ డేటింగ్ చేస్తున్నాడన్న వార్తలతో సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరిగింది. వీరే కాదు.. మహమ్మద్ షమి, శుభమన్ గిల్ వంటి క్రికెటర్లు కూడా పలువురు హీరోయిన్స్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. తాజాగా ఈ లిస్ట్‌లో చేరాడు వాషింగ్టన్ సుందర్.

Is Washington Sundar dating Sahiba Bali couple enjoying a quiet moment at a cafe

సౌత్ ఆఫ్రికా సిరిస్‌లో అట్టర్ ఫ్లాప్
బౌలింగ్, బ్యాటింగ్‌లో తిరుగులేని ప్రదర్శనతో టీమిండియాలో స్థానం దక్కించుకున్నాడు వాషింగ్టన్ సుందర్. స్టార్ ఆల్‌రౌండర్ అవుతాడని అనుకుంటే చేజేతులా కెరీర్ పాడు చేసుకుంటున్నారు సుందర్. ప్రస్తుతం స్వదేశంలో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న వన్డే సిరీస్‌లో తొలి రెండు వన్డేలలోనూ సుందర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. మొదటి వన్డేలో 13 పరుగులు, రెండో వన్డేలో కేవలం ఒకే ఒక్క పరుగు చేశారు. అటు బౌలింగ్‌లోనూ పస తగ్గింది. సఫారీ బౌలర్లు సుందర్‌ను ఓ ఆట ఆడుకున్నారు. మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయంతో సమంగా ఉండటంతో విశాఖపట్నంలో జరగనున్న మూడో వన్డేపై ఆసక్తి నెలకొంది.

వాషింగ్టన్ సుందర్‌పై వేటు
విశాఖలో విజయం సాధించి సిరీస్‌ను అందుకోవాలని భారత్, దక్షిణాఫ్రికాలు పట్టుదలతో ఉన్నాయి. టెస్ట్ సిరీస్‌లో ఘోర వైఫల్యంతో విమర్శలు మూటకట్టుకుంటున్న కోచ్ గౌతమ్ గంభీర్.. వన్డే సిరీస్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నాడు. దీనిలో భాగంగా మూడో వన్డేలో సుందర్‌పై వేటు వేసి అతని స్థానంలో తిలక్ వర్మకు అవకాశం కల్పించారు. అలా ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వాషింగ్టన్ సుందర్‌ తాజాగా డేటింగ్ వార్తలతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు.

ఆ నటితో సుందర్ డేటింగ్?
బాలీవుడ్ నటి సాహిబా బాలితో కలిసి ఓ కేఫేలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు సుందర్. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారా? సీక్రెట్‌గా ప్రేమాయణం సాగిస్తున్నారా? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై సాహిబా, సుందర్‌లు స్పందిస్తే కానీ ఈ పుకార్లకు చెక్ పడేలా కనిపించడం లేదు.

క్రికెట్‌తో సాహిబాకు అనుబంధం
ఇక సాహిబా తన అందంతో మెస్మరైజ్ చేయడంతో ఆమె ఎవరా అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. సాహిబా బాలీ కాశ్మీర్ అమ్మాయి.. నాటకాలతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో నటించింది. నటనతో పాటు గతేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో స్పోర్ట్స్ ప్రెజెంటర్‌గానూ సందడి చేసింది. అలాగే ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో వ్యాఖ్యాతగానూ పనిచేసింది. క్రికెట్‌కు దగ్గరగా ఉన్న నేపథ్యంలోనే వాషింగ్టన్ సుందర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడిందా? లేక ముందు నుంచే సాహిబా- సుందర్‌ల మధ్య రిలేషన్‌లో ఉన్నారా? అన్న గాసిప్స్ వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Read more about: washington sundar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X