అల్లు అర్జున్ మూవీలో హాలీవుడ్ సూపర్ స్టార్.. సెన్సేషనల్‌గా అట్లీ ప్లానింగ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్‌కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసి మరింత హంగామా సృష్టించారు.హాలీవుడ్ స్థాయిలో 1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా సంబంధించిన అప్‌డేట్స్ క్రేజీగా మారాయి. ఈ సినిమాలో నటిస్తున్న స్టార్స్ వివరాలు సెన్సేషనల్‌గా మారుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీలో హాలీవుడ్ హీరో నటిస్తున్నారనే విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో నటిస్తున్న ఇంటర్నేషనల్ స్టార్ వివరాల్లోకి వెళితే..
పుష్ప తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దీపిక పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో జాన్వీ కపూర్, మృణాల్ థాకూర్, భాగ్యశ్రీ భోర్సే నటిస్తున్నారనే విషయం మీడియాలో మార్మోగుతున్నది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలు పాత్రను మలయాళ హీరోయిన్ నజ్రియా నజీం చేస్తున్నట్టు సమాచారం.

అలాగే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ భారీగా ముంబైలో జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో సహా ముంబైలో మకాం పెట్టారు. ఈ మూవీ షూటింగ్ కనీవినీ ఎరుగని విధంగా లేటెస్ట్ టెక్నాలజీతో తెరకెక్కతున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ నటిస్తున్నారనే విషయం బయటకు వచ్చింది.
అల్లు అర్జున్ కెరీర్‌లో 22వ సినిమాగా తెరకెక్కుతున్న AA22 మూవీలో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీలో ఐకాన్ స్టార్‌ను ఎదురించే విలన్ పాత్రలో ఆయన కనిపించబోతున్నారు. ఈ సినిమాలో నటించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీలో నటిస్తున్నందుకు రికార్డు పారితోషికం ఆఫర్ చేస్తున్నారు. త్వరలోనే విల్ స్మిత్ గురించిన అధికార ప్రకటన త్వరలోనే రానున్నది అని సినీ వర్గాలు పేర్కొన్నాయి.
భారతీయ ప్రేక్షకులకు విల్ స్మిత్ సుపరిచితులు. మెన్ ఇన్ బ్లాక్, ఐ యామ్ లెజెండ్, ది పర్సుట్ ఆఫ్ హ్యాపీనెస్ చిత్రాల ద్వారా ఇండియన్ ఆడియెన్స్‌కు చేరువయ్యారు. ఇక అల్లు అర్జున్ సినిమాలో నటిచడం ద్వారా తెలుగు భాష వారికే కాకుండా దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల వారికి మరింత చేరువ అవ్వడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇక ఈ సినిమాలో సర్‌ప్రైజ్ చేసే విధంగా నటీనటుల ఎంపిక ఉంటుందనే మాట కూడా వినిపిస్తున్నది.
భారతీయ సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయనటువంటి పాయింట్‌తో సైంటిఫిక్ ఫిక్షన్, థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను సుమారుగా 800 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ డబుల్ రోల్ పోషిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వర్క్ అమెరికాలో జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అవెంజర్, స్పైడర్ మ్యాన్, వండర ఉమెన్ సినిమాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేస్తున్నారు అని తెలిసింది.


Click it and Unblock the Notifications











