విలన్‌గా యష్ రికార్డు రెమ్యునరేషన్ .. 'కేజీఎఫ్' హీరోకి ఎన్ని వందల కోట్లంటే?

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర అది కూడా పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ ఉన్న హీరోస్ లిస్ట్ తీస్తే అందులో ఎక్కువగా మన తెలుగు హీరోల పేర్లు వస్తాయి. అలాగే మొత్తం సౌత్ నుంచి చూసుకున్నట్టు అయితే కన్నడ ఇండస్ట్రీ నుంచి రాకింగ్ స్టార్ హీరో యష్ కూడా కనిపిస్తాడు. తాను నటించిన గత చిత్రాలు కేజిఎఫ్ చాప్టర్ 1, అలాగే చాప్టర్ 2 సినిమాలు తనకి పాన్ ఇండియా లెవెల్లో ఎనలేని క్రేజ్ తీసుకొచ్చాయి.

దీనితో పాన్ ఇండియా లెవెల్లో తన నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుంది అనే సంశయంలోనే బిగ్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసాడు. సరే ఇదంతా బాగానే ఉంది కానీ ప్రస్తుతం యష్ కన్నడ లోనే కాకుండా హిందీలో కూడా ఓ భారీ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా కోసం యష్ ఇపుడు అందుకుంటున్న పారితోషికం రికార్డు లెవెల్లో ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి.

is yash taking sensational remuneration for ramayan in hindi

మామూలుగా హీరోలకి ఓ రేంజ్ రెమ్యునరేషన్ ఇస్తుంటే, విలన్‌గా చేస్తున్న తనకు అంతకు మించిన రెమ్యునరేషన్‌ని అందుకుంటున్నట్టుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. హిందీ ఇండస్ట్రీలో రణబీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు నితీష్ తివారీ రామాయణంపై రెండు భాగాల సెన్సేషనల్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రణబీర్ కపూర్ రామునిగా, సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్నారు.

అయితే రామాయణంలో రాముడి పాత్ర ఎంత ముఖ్యమో రావణుని పాత్ర కూడా ఎంతో కీలకం. అందుకే ఆ బాధ్యతని కన్నడ సినిమా నుంచి మేకర్స్ యష్ కి అప్పగించారు. ఈ నేపథ్యంలో యష్ రికార్డు రెమ్యునరేషన్‌ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. మరి లేటెస్ట్ గాసిప్స్ ప్రకారం ఆయన ఏకంగా 200 కోట్ల రెమ్యునరేషన్‌ని అందుకుంటున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

is yash taking sensational remuneration for ramayan in hindi

దీనితో ఇండియాలోనే ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకున్న విలన్ రోల్ ఏది లేదు అంటూ ఇపుడు ఓ టాక్ స్ప్రెడ్ అవుతుంది. ఇందులో ఎంతమేర నిజముందో కానీ యష్ మాత్రం ఈ సినిమాకి నిర్మాత గానూ వ్యవహరిస్తున్నారు. అంటే తాను నటించడమే కాకుండా సినిమా ప్రొడక్షన్‌లోనూ భాగం కూడా. ఈ లాజిక్‌‌ను పరిశీలిస్తే తన సినిమాకి తానే రెమ్యునరేషన్ తీసుకున్నాడా మరి?

లేనిపక్షంలో హిందీ సైడ్ నుంచి నిర్మాతలు సెపరేట్‌గా ఏమన్నా తనకి చెల్లించి ఉండాలి . ఇలా ప్రస్తుతానికి అయితే ఈ క్రేజీ గాసిప్ యష్ పై వైరల్ గా మారింది. ఈ భారీ సినిమాతో పాటుగా యష్ హీరోగా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తో "టాక్సిక్" అనే హై యాక్షన్ డ్రామాని తాను చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో యష్ ఒక గ్యాంగ్ స్టర్ రోల్‌లో కనిపించనున్నాడని టాక్. అలాగే ఇది కూడా కేజీఎఫ్ తరహాలోనే పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కిస్తున్నట్టుగా సమాచారం.

More from Filmibeat

Read more about: yash ramayan sai pallavi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X