'ఎవడు' కథ కీ రాజమౌళి 'ఈగ' కీ పోలిక??
హైదరాబాద్ : రీసెంట్ గా ఆడియో విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకున్న చిత్రం 'ఎవడు' . ఈ చిత్రం కథ కీ రాజమౌళి 'ఈగ' కీ పోలిక ఉందంటూ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. వారు చెప్పేదాని ప్రకారం .. 'ఈగ' లో నాని చచ్చిపోయి...ఈగ గా పుట్టి విలన్ పై పగ తీర్చుకుంటాడు. నాని మొదటి ఇరవై నిముషాలు ఉంటాడు.
అలాగే.. రామ్ చరణ్ 'ఎవడు' లోనూ... అల్లు అర్జున్ .. ఐదునిముషాలే ఉంటాడుట. సినిమా మొదలైన పది నిముషాల్లో .. అల్లు అర్జున్ ..తీవ్రంగా గాయపడతాడు. దీంతో తన ముఖానికి రామ్ చరణ్ ఫేస్ ని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని, తనని ఎవరైతే గాయపరిచి, సమాజానికి కీడు చేయాలనుకున్నారో..వారిపై పగ తీర్చుకుంటాడు.
రాజమౌళి 'ఈగ' లో నాని లేకపోయినా ఎలా నాని సినిమా అంతా ఉన్నట్లు ఫీల్ తెప్పిస్తాడో.. 'ఎవడు' లో అలా అల్లు అర్జున్ కనపడకపోయినా... సినిమా అంతా...అతను ఉన్నట్లే మనకు ఫీల్ వస్తుందని చెప్తున్నారు. హాలీవుడ్ ఫేస్ హాఫ్ చిత్రం నుంచి ప్రేరణ పొంది వస్తున్న ఈ చిత్రం సంచలన విజయం సాధించటం ఖాయం అంటున్నారు.
దిల్ రాజు 'ఎవడు' గురించి మాట్లాడుతూ... వాడి కంట్లో భయం లేదు. ఒంట్లో బెదురు లేదు. దెబ్బకి తిరుగే లేదు. గెలవాలంటే యుద్ధం చేసి తీరాల్సిందే అంటాడు. ఉంటే ఆశలు, పోతే ప్రాణాలే అంటాడు. ఇంతకీ వాడు ఎవడో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు దిల్ రాజు. ఆయన నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం 'ఎవడు'.
రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్నారు. శ్రుతిహాసన్, అమీజాక్సన్ హీరోయిన్స్. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ సాగుతోంది. ఈ నెలలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. నిర్మాత మాట్లాడుతూ ''వినూత్నమైన కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రమిది. వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉంటాయి. రామ్‌చరణ్ పాత్ర, నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇటీవల విడుదలైన పాటలకు చక్కటి స్పందన లభిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం చిత్రానికి బలాన్నిస్తుంది. అల్లు అర్జున్, కాజల్ పోషించిన పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయేలా ఉంటాయి''అన్నారు.


Click it and Unblock the Notifications












