Game Changer శంకర్ స్థానంలో యువ దర్శకుడు.. తప్పని పరిస్థితుల్లో దిల్ రాజు షాకింగ్ నిర్ణయం!
మెగా పవర్ రాంచరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ మూవీ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తున్నది. ఈ మూవీ అనేక కారణాలతో పలుమార్లు షూటింగ్ అనుకొన్న షెడ్యూల్ ప్రకారం జరగకపోవడంతో ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతున్నది. అయితే సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు భారీ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం యువ దర్శకుడిని రంగంలోకి దించుతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ దర్శకుడి వివరాల్లోకి వెళితే..
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ క్రేజీ ప్రాజెక్టుగా మొదలైంది. అయితే గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్‌కు శంకర్ దర్శకత్వం వహించడంతో పలు సమస్యలు ముందుకు వచ్చాయి. శంకర్ దర్శకత్వం వహించే ఇండియన్ 2 సినిమా పూర్తి చేయకుండా గేమ్ ఛేంజర్ షూటింగ్ చేయవద్దని లైకా నోటీసులు పంపింది. దాంతో కొద్ది రోజులు షూటింగ్ ఆగిపోయింది.

గేమ్ ఛేంజర్ సినిమాకు రాంచరణ్ పర్సనల్, ప్రొఫెషనల్ పనులు కూడా అడ్డంకిగా మారాయి. RRR మూవీ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం నెల రోజులకుపైగా రాంచరణ్ అమెరికాలో ఉండటం, అలాగే భార్య ఉపాసన ప్రసవం కోసం కొంత గ్యాప్ తీసుకోవడంతో గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ఆగుతూ లేస్తూ జరుగుతున్నది.
ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ సమీపిస్తుండటం, అలాగే ఇండియన్ 2 సినిమా షూట్‌లో శంకర్ బిజీగా ఉండటం కొంత గందరగోళానికి కారణమైంది. అయితే శంకర్ అందుబాటులో లేని కారణంగా రాంచరణ్, దిల్ రాజు టీమ్ ఆసక్తికరమైన నిర్ణయం తీసుకొన్నారు. ఎట్టి పరిస్థితిలో సంక్రాంతి రేసులో దిగేందుకు దిల్ రాజు ప్లాన్‌లో భాగంగా యువ దర్శకుడు శైలేష్ కొలనును రంగంలోకి దించినట్టు తెలుస్తున్నది.

గేమ్ ఛేంజర్ సినిమాలోని కొంత పార్ట్‌ను హిట్ మూవీ సిరీస్ దర్శకుడు శైలేష్ కొలనుతో షూట్ చేయించాలని ప్లాన్ చేశారు. యాక్షన్ సీన్లకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను శైలేష్‌తో పూర్తి చేయాలని దిల్ రాజు నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తున్నది. జూలై 11వ తేదీ నుంచి యాక్షన్ సీన్ల షూట్ మొదలవుతుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.

శైలేష్ కొలను సినిమా కెరీర్ విషయానికి వస్తే.. హిట్ చిత్రంతో హిట్టు కొట్టిన శైలేష్ కొలను.. హిట్ 2 సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకొన్నాడు. ప్రస్తుతం వెంకటేష్‌తో కలిసి సైంధవ్ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే నానితో హిట్ 3 సినిమాను కూడా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ యాక్షన్ సీన్లకు దర్శకత్వం వహించే అవకాశం రావడం టాలీవుడ్‌లో శైలేష్‌కు ప్రమోషన్ లభించినట్టే అని కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











