NTR - Vetrimaaran movie: ఇంతకీ ఎన్టీఆర్, వెట్రిమారన్ కాంబో మూవీ పట్టాలెక్కేనా?
NTR - Vetrimaaran movie update: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'దేవర' అతి త్వరలో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక రిలీజ్ డే దగ్గర పడుతున్న కొద్దీ సినిమా ప్రమోషన్స్ మీద జూనియర్ ఎన్టీఆర్ అండ్ కో స్పెషల్ ఫోకస్ పెట్టారు. దేవర సినిమా ప్రమోషన్స్ లో తో పని చేయాలని ఉందని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ అడగడంతో డైరెక్టర్ వెట్రిమారన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే.. జూనియర్ ఎన్టీఆర్, వెట్రిమారన్ కాంబో మూవీ ఎప్పుడు తెరకెక్కబోతుంది? ఇంకా ఈ మూవీ సాధ్యాసాధ్యాలపై ఓ లూక్కేద్దాం.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా 'దేవర'. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్ భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో తారక్ దేవర పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 27 న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇక రిలీజ్ డే దగ్గర పడుతున్న కొద్దీ సినిమా ప్రమోషన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో జూ. ఎన్టీఆర్ ఓ ప్రమోషన్స్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ తో పని చేయాలని ఉందని తన మనసులో మాట బయట పెట్టారు. అవసరమైతే ఆ మూవీని తమిళంలో షూట్ చేసి.. తెలుగులో డబ్ చేద్దామని జూనియర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు. దీంతో తారక్ కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరలయ్యాయి.

మరోవైపు.. వెట్రిమారన్ కూడా ట్రెండ్ అయిపోతున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? ఆ హిట్ మూవీ ఎంటీ? అని తెగ వెతకడం ప్రారంభించారు మూవీ లవర్స్. దీంతో వెట్రిమారన్ నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయ్యారు. మరోవైపు.. జూనియర్ ఎన్టీఆర్ రిక్వెస్ట్ తన దృష్టికి రావడంతో కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ తాజాగా స్పందించారు.
యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ తో తాను కచ్చితంగా సినిమా చేస్తానని వెట్రిమారన్ ప్రకటించారు. గతంలోనే జూ. ఎన్టీఆర్ తో సినిమా చేయాలని భావించిననీ, ఈ సమయంలో ఆయనకు కథ కూడా చెప్పానని అన్నారు. అయితే.. తామిద్దరం కెరీర్ పరంగా బిజీగా ఉండటంతో సాధ్యం కాలేదని ఆయన వెల్లడించారు.
అయితే. ఇప్పటికే పలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాననీ, అందులో కొన్ని సినిమాలు షూటింగ్ లో ఉంటే.. మరో సినిమా ఫ్రీ ప్రొడక్సన్స లో ఉందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ లు పూర్తి చేసిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ తో చేసే సినిమాపై దృష్టి పెడతానని హామీ ఇచ్చారు వెట్రిమారన్. లాక్ డౌన్ తర్వాత ఎన్టీఆర్ కు వెట్రిమారన్ ఒక స్క్రిప్ట్ చెప్పానని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్టేట్మెంట్ తో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - వెంట్రి మారన్ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని ఫ్యాన్ తెగ సంతోషపడుతున్నారు.

అయితే ఈ కాంబో ఇప్పట్లో తెరకెక్కడం కష్టమేనని చెప్పాలి. ముందు వెట్రిమారన్ విషయానికి వస్తే.. ఆయన పూచర్ ప్రాజెక్ట్స్ నెక్స్ లెవల్ లో ఉన్నాయి. ప్రస్తుతం 'విడుతలై పార్ట్ 2' అనే మూవీతో బిజీబిజీగా ఉన్న ఆయన చేతిలో మరో క్రేజీ ప్రాజెక్ట్ ఉంది. ఇదో రెండు సంవత్సరాలు పట్టవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ ఇష్టం కొద్దీ ఆ సినిమా పక్కన పెట్టి ఈ మూవీ పట్టలెక్కించాలన్న కష్టమే. ఎందుకంటే.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 లోనే బిజీబిజీగానే ఉన్నారు. ఈ మూవీకి ఇంకా
పార్ట్ 2 కూడా ఉంది.
ఈ సీక్వెల్ పూర్తి కాగానే వారి కాంబోలో మూవీ వస్తుందనుకుంటే కష్టమే. దేవర 2 పూర్తి కాగానే.. ప్రశాంత్ నీల్‌తో 2 పార్ట్స్ సినిమా ఒకటి చేస్తున్నారు. వార్ 2 ఎలాగూ ఉండనే ఉంది. ఇలా ఎన్టీఆర్ తాను ఒప్పుకున్నా.. అగ్రిమెంట్ చేసుకున్నా సినిమాలు పూర్తి కావాలంటే.. దాదాపు మూడు నుంచి నాలుగేండ్ల సమయం పట్టే అవకాశముంది. అప్పుటికి వెట్రిమారన్ వేరే సినిమాలో బిజీ కాకపోతే.. ఈ వెట్రిమారన్ -ఎన్టీఆర్ కాంబో మూవీ సెట్స్‌పైకి వస్తుంది. మరో నాలుగైదు ఏండ్లలో ఎలాంటి పరిస్థితులుంటాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











