Bigg Boss Telugu 8 : వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో బిగ్‌బాస్‌లోకి వైసీపీ నేత ప్రియురాలు.. ఫీజులు ఎగిరిపోవాల్సిందే !!
బిగ్‌బాస్ తెలుగు 8 సక్సెస్‌ఫుల్‌గా థర్డ్ వీక్‌లోకి అడుగుపెట్టింది. 14 మందితో మొదలైన ఈ సీజన్‌లో ప్రస్తుతం 12 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. తొలివారం బెజవాడ బేబక్క, రెండో వారం ఆర్జే శేఖర్ భాషాలు ఎలిమినేట్ అయ్యారు. తొలి రెండు వారాలు ఆటను అర్ధం చేసుకోవడానికి ట్రై చేసిన ఇంటి సభ్యులు .. ఇప్పుడిప్పుడే గేమ్‌లోకి దిగుతున్నారు. ఇద్దరు హౌస్‌మెట్స్ వెళ్లిపోవడంతో వారి ప్లేస్‌లో మరికొందరిని వైల్డ్‌కార్డ్ ద్వారా లోపలికి పంపుతారనే గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 8లో వేగం పెరిగింది. గేమ్ ఎలా ఆడాలో, ప్రత్యర్ధిని ఎలా ఇరుకునపెట్టాలో తెలుసుకుని అందుకు తగినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ వారం నామినేషన్లు వాడివేడిగా జరగ్గా.. మరోసారి 8 మంది నామినేషన్‌లలో నిలిచారు. నైనిక, నాగ మణికంఠ, విష్ణుప్రియ, అభయ్, కిర్రాక్ సీత, యష్మి గౌడ, ప్రేరణ, పృథ్వి నామినేషన్స్‌లో నిలిచారు. సిల్లీ రీజన్స్ కాకుండా ఈసారి మంచి పాయింట్ పట్టుకుని నామినేట్ చేయడం విశేషం.

చీఫ్‌గా ఇంటిపై పెత్తనం చేస్తూ యాటిట్యూడ్ చూపించిన యష్మి గౌడ ఈ వారం నామినేషన్స్‌లోకి రావడం పెద్ద విషయం. నాగ మణికంఠ ఈమెను నామినేషన్స్‌లోకి తీసుకొచ్చాడు. ఈ వారం అత్యధిక ఓట్లు యష్మికే పడ్డాయి.. మణికంఠతో పాటు సోనియా, కిర్రాక్ సీత సహా పలువురు కంటెస్టెంట్స్ మరోమాట లేకుండా ఆమెనే నామినేట్ చేశారు. ఈ దెబ్బతో యష్మికి మండిపోయింది.. మణికంఠను నామినేట్ చేస్తూ, నువ్వు నా హార్ట్ బ్రేక్ చేశావ్, ఈ హౌస్‌లో ఉన్నన్ని రోజులూ నేను నిన్నే నామినేట్ చేస్తానని చెప్పింది. ఆ తర్వాత సోనియా అన్న మాటలకు యష్మి బాగా హార్ట్ అయి ఏడ్చింది.. దీంతో సోనియా ఆమెను హగ్ చేసుకుని ఓదార్చింది.
ఇదిలాఉండగా.. గత సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా బిగ్‌బాస్‌కి బాగా కలిసొచ్చింది.. ఈసారి కూడా అదే స్ట్రాటజీ వాడాలని నిర్వాహకులు భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చాలా మంది వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగింది. ముక్కు అవినాష్, జ్యోతి రాయ్, గీతూ రాయల్ సహా పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. చివరికి ఫస్ట్ వీక్‌లోనే ఎలిమినేట్ అయిన బెజవాడ బేబక్క కూడా వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇస్తుందని అన్నారు. కానీ అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందా లేక మరేదైనా కొత్త స్ట్రాటజీ వాడతారా అన్నది సస్పెన్స్‌గా మారింది.
ఈ క్రమంలోనే వైల్డ్ కార్డ్ లిస్ట్‌లో మరో పేరు తెరుపైకి వచ్చింది. అది ఎవరో కాదు.. వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు దివ్వెల మాధురి. పతి .. పత్నీ .. ఔర్ వో అన్నట్లుగా సాగిన ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకం రేపింది. మాధురితో శ్రీనివాస్ రిలేషన్, వాణి గొడవ, మీడియా ఎదుట పంచాయతీ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వివాదం కారణంగా మాధురి బాగా పాపులర్ అయ్యారు. అంతకుముందే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో రీల్స్ పెట్టేవారు మాధురి.. ఈ దెబ్బతో ఆవిడ పేజికి ఫాలోవర్లు బాగా పెరిగారు.
పెద్దల జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగినట్లుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో మాధురి బిగ్‌బాస్ తెలుగు 8లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ వార్తా సంస్థ నిర్వహించిన లైవ్ డిబేట్‌లో మీకు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లడం ఇంట్రెస్టేనా అని అడగ్గా.. తనకు చాలా ఇష్టమని మాధురి ఆన్సర్ ఇస్తుంది. ఆవిడ మాటలతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. మరి మాధురి ఎంట్రీ ఎంత వరకు నిజమో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











