ఆ దర్శకుడి చేతిలో భంగపడ్డ పవన్ కళ్యాణ్!?
మెగా స్టార్ చిరంజీవి రాజకీయాల్లో అడుగు పెట్టిన తర్వాత తమ కుటుంబ సినీ వ్యవహారాలను చూసుకునే బాధ్యత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై పడిన విషయం తెలిసిందే. తమ కుటుంబం నుంచి పరిశ్రమలోకి హీరోగా అడుగుపెట్టడానికి రెడీగా ఉన్న యువ హీరోలు సాయి ధరమ్ తేజ్(చిరు మేనల్లుడు), వరుణ్ తేజ్(నాగబాబు తనయుడు)లకు మంచి దర్శక నిర్మాతలను వెతికే బాధ్యత తెర వెనక ఉండి చూసుకుంటున్నది పవన్ కళ్యాణే అని మెగా కుటుంబం సన్నిహితులు చెబుతున్న మాట.
వైవిఎస్ చౌదరి సాయి ధరమ్ తేజ్‌తో 'రేయ్' సినిమా ప్రారంభించినప్పటికీ సంవత్సరాలు గడిచినా ఆ చిత్రం కనీసం సంగం కూడా పూర్తి కాలేదు. పరిస్థితి చూస్తుంటే వైవిఎస్ చౌదరి ఈ ప్రాజెక్టును పట్టించుకున్నట్లే కనిపించడం లేదనే వాదన వినిపిస్తోంది. ఆ సినిమా పక్కన పెట్టి 'నిప్పు' సినిమా తీసిన చౌదరి బాగా నష్టపోయి ఇప్పడు 'రేయ్' సినిమాకు డబ్బులేని పరిస్థితికి వెళ్లాడు. ఆ తర్వాత చిరంజీవి కల్పించుకుని పీఆర్పీ ఎమ్మెల్యే ద్వారా ఆ సినిమాకు నిధులు సమకూర్చే బాధ్యత అప్పజెప్పాడని ఆ మధ్య వార్తలు వినిపించాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో చివరకు పవన్ కళ్యాణ్ బదనాం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అప్రూవ్ చేసిన తర్వాతే చౌదరి చేతిలో సాయి ధరమ్ తేజను పెట్టరట. పవన్ కళ్యాణ్ నమ్మకాన్ని వైవిఎస్ చౌదరి నిలబెట్టక పోవడం పవర్ స్టార్‌కి భంగపాటు లాంటిదే అని అంటున్నారంతా.
అందుకే నాగబాబు కొడుకు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా ముందుకు వెలుతున్నాడు. వాస్తవానికి 2008లోనే రవిబాబు 'నచ్చావులే' సినిమా ద్వారా వరుణ్ తేజ్ హీరోగా ఎంటర్ అవ్వాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు వరుణ్ తేజకు ఓకే కాలేదు. తర్వాత 2009, 2010 సంవత్సరాల్లో ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు జరిగినా...మెగా ఫ్యామిలీ అంతా అప్పుడు రాజకీయాల్లో బిజీబిజీగా గడపడం, 2011లో ప్రజారాజ్యం విలీనం ఇష్య్యూతో ఈ విషయాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు అంతా సర్దు కోవడంతో మళ్లీ వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ విషయం దృష్టి పెట్టారు.


Click it and Unblock the Notifications











