Indra Vs Samarashimha Reddy: చిరంజీవి, బాలయ్య మల్టీస్టారర్.. స్టార్ డైరెక్టర్ రంగ ప్రవేశం!
నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుక పలు సంచలనాలకు వేదికగా మారింది. తెలుగు సినిమా చరిత్రను మరో రేంజ్‌కు తీసుకెళ్లే కార్యక్రమంగా మారిందనే కామెంట్స్ సినివర్గాలు అభిప్రాయపడ్డుతున్నాయి. ఇప్పటి వరకు నందమూరి, మెగా ఫ్యాన్స్ మధ్య దూరాన్ని తగ్గించేలా ఈ వేడుక ప్రాధాన్యం సంతరించుకొన్నది. అయితే చిరంజీవి చేసిన ఛాలెంజ్‌ను ఓ స్టార్ దర్శకుడు రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది. ఈ వివరాల్లోకి వెళితే..
తెలుగు సినిమా పరిశ్రమలో బాలయ్య నటజీవితం 50 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా టాలీవుడ్ భారీ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దక్షిణాది నుంచి రజనీకాంత్, శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర లాంటి ప్రముఖులు తరలి రావడంతో ఈ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

ఇదిలా ఉండగా, చిరంజీవి రాకతో సినిమా పరిశ్రమ ఒక్కటే అనే భావనను కలిగించింది. ఇక చిరంజీవి చేసిన ప్రసంగం అందరూ హీరోల ఫ్యాన్స్‌ను మరింత స్పూర్తిని కలిగించింది. ఈ వేడుకలో నందమూరి, మెగా ఫ్యాన్స్ మధ్య విభేదాలు, గొడవలు ఉండేవి. ప్రస్తుతం ఆ విషయం తగ్గిపోయింది. ఇంకా ఆ గొడవలను తగ్గించాలంటే బాలయ్యతో నేను సినిమా చేయడానికి సిద్దంగా ఉన్నాను అంటూ చెప్పారు.
అయితే ఇంద్రసేనా రెడ్డి, సమరసింహారెడ్డి పాత్రలతో ఎవరైనా డైరెక్టర్ గానీ, రచయిత గానీ మంచి కథతో వస్తే.. నేను నటించడానికి రెడీ.. నీవు రెడీనా బాలయ్య అంటే.. ఆయన డబుల్ రెడీ అంటూ ముందుకొచ్చారు. అయితే బోయపాటికి సూచిస్తూ.. మీరు కథ రాస్తే మేము నటించడానికి రెడీ అంటూ ఛాలెంజ్ విసిరారు.
అయితే ఇంద్ర, సమరసింహారెడ్డి సినిమాలను ఆధారంగా చేసుకొని చిరంజీవి, బాలయ్య పాత్రలను రాయడానికి తాను సిద్దమే అంటూ దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరీ ముందుకు వచ్చినట్టు తెలుస్తున్ననది. ఇంద్ర, సమరసింహారెడ్డి పాత్రలను కలిపి తెరమీద మెగాస్టార్, నటరత్న కలిపి చూపించేలా ప్రయత్నాలను మొదలుపెట్టనున్నట్టు తెలిసింది.
వైవీఎస్ చౌదరీ విషయానికి వస్తే.. నందమూరి కుటుంబానికి భక్తుడైన ఆయన ఆ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. బాలయ్య, హరికృష్ణతో సినిమాలు తీసిన ఘనత ఉంది. అయితే కొద్దికాలంగా ఇండస్ట్రీకి దూరమైన ఆయన తాజాగా కొత్త సినిమాలతో బిజీగా మారారు. తన కథతో చిరు, బాలయ్యను ఒప్పిస్తే.. తెలుగు సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం గ్యారెంటీ అనే టాక్ నడుస్తున్నది.


Click it and Unblock the Notifications











