సునీల్ ఆమెను వదిలేటట్లు లేడు

ఇక సునీల్ గత సంవత్సరం అప్పలరాజు చిత్రంతో ముందుకొచ్చారు. అది వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత కూడా వర్మ డైరక్ట్ చేసిన దొంగల ముఠా లో మరోమారు కనిపించారు. అదీ నిలబడలేదు. దాంతో సునీల్ కి గ్యాప్ వచ్చేసింది. రాజమౌళి అశోశియేట్ కోటి తో అనుకున్న నెపోలియన్ చిత్రం కూడా మెటీరియలైజ్ కాలేదు. ఈ నేపధ్యంలో అహనా పెళ్లంట చిత్రంతో హిట్ కొట్టిన వీరభద్రమ్ దర్సకత్వంలో 'పూలరంగుడు'చిత్రం కమిటయ్యాడు. కామిడీతో నడిచే ఈ చిత్రం క్లైమాక్స్ లో తన సిక్స్ పాక్ బాడీని సైతం ప్రదర్శించనున్నాడు. ఈ చిత్రం మళ్లీ తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్తుందని భావిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











