OG మూవీలో మరో హీరోయిన్.. ఏకంగా పవన్ కల్యాణ్‌నే ఢీకొట్టే పాత్రలో!
టాలీవుడ్‌లోని మరో స్టార్ హీరో చేయనంత స్పీడుగా సినిమాలను పూర్తి చేసుకుంటూ దూసుకుపోతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పుడు ఏకంగా నాలుగు ప్రాజెక్టులను ఏకకాలంలో చేస్తూ వస్తున్న అతడు.. వాటిని ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసుకునేలా ప్లాన్ చేశాడు. ఇలా ఇప్పుడు పవన్ చేస్తున్న చిత్రాల్లో 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ఒకటి. యాక్షన్ జోనర్‌లో 1990 నాటి బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్, సాహో ఫేం సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై ఆరంభంలోనే హైప్ భారీగా ఏర్పడిందని చెప్పాలి.
సుజిత్ - పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో రాబోతున్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ముంబై నేపథ్యంతో సాగే సినిమా కావడంతో అక్కడే ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్‌ను మొదలు పెట్టారు. అలా ఇప్పటికే మూడు షెడ్యూళ్లను విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నారు. అదే సమయంలో దీనికి సంబంధించిన 50 శాతానికి పైగా షూటింగ్‌ను కూడా కంప్లీట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీని నుంచి తాజాగా ఓ న్యూస్ లీకైంది.

పవర్‌ఫుల్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. అందుకే ఇందులో ఎంతో మంది టాలెంటెడ్ యాక్టర్లు నటిస్తున్నారు. ఇలా ఇప్పటికే కొందరి పేర్లను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఇక, ఇప్పుడు ఇందులో ఓ యాక్షన్ రోల్ కోసం కోలీవుడ్‌కు చెందిన ఐశ్వర్య మీనన్‌ను తీసుకున్నారని తాజాగా తెలిసింది. అంతేకాదు, ఇందులో ఆమె పవన్‌నే ఢీకొట్టే పోలీస్ పాత్రను చేస్తుందని అంటున్నారు. ఇదిలా ఉండగా ఐశ్వర్య తాజాగా విడుదలైన నిఖిల్ 'స్పై' మూవీలో హీరోయిన్‌గా నటించి మెప్పించింది.

ఇక, 'OG' చిత్రాన్ని RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రలు చేస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే డిసెంబర్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.


Click it and Unblock the Notifications











