»   » ఏ క్షణమైనా ఎటాక్:షూటింగ్ లో ఉన్న ఆ భారీ సినిమా నిర్మాత,హీరో పై ఐటీ శాఖ కన్ను?

ఏ క్షణమైనా ఎటాక్:షూటింగ్ లో ఉన్న ఆ భారీ సినిమా నిర్మాత,హీరో పై ఐటీ శాఖ కన్ను?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బ్లాక్ మని పై మోడీ నోట్ల రద్దు అస్త్ర్రం ప్రయోగించాక పరిస్దితులు మారిపోయాయి. ముఖ్యంగా సినిమా నిర్మాతలు ఇబ్బందులు చెప్పలేం. సినిమా అంటే పూర్తి వైట్ తో జరగదని అందరికీ తెలుసు..బోల్డు బ్లాక్ మనీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. పైకి చెప్పే లెక్కలు వేరు. అసలు లెక్కలు వేరుగా ఉంటాయి.

అలా వేరు వేరు ఎక్కౌంట్స్ మెయింటైన్ చెయ్యకపోతే హీరోలకు సర్ది చెప్పలేం, వారు అడిగే అంత పెద్ద మొత్తాలు ఇవ్వలేమని చెప్తూంటారు నిర్మాతలు. ఈ విషయం అందరికీ బహిరంగమే. ముఖ్యంగా సినిమా వాళ్ళపై ఓ కన్నేసి ఉండే ఐటి శాఖ గురించి అయితే ఇక చెప్పనే అక్కర్లేదు.

పొలిటీషియన్స్ కు అయితే ముందుగానే సమాచారం ఉంటుందంటారు. కానీ సినిమావాళ్లకు అలా హెచ్చరించేవాళ్లు ఏరి. ఉన్న సినిమా టెన్షన్స్ కు తోడు ఐటీ శాఖ ఎప్పుడు దాడి చేస్తుందా అనే ఆలోచనతోనే పనులు నడుస్తూంటాయి.

IT department's eye on Tollywod Big Production

ఈ మధ్యన బాహుబలి నిర్మాతలపై ఐటి దాడి, రీసెంట్ గా నారా రోహిత్ పై ఐటీ దాడి తర్వాత ...మళ్లీ ఇండస్ట్రీ లో ఐటీ దాడుల విషయం హాట్ టాపిక్ గా మారింది. వారు చెప్పుకునే దాని ప్రకారం...ఐటీ శాఖ వాళ్ళు ఇప్పటికే పెద్ద సినిమాలు వివరాలు లాగుతున్నారని, ఆల్రెడీ షూటింగ్ లో ఉన్నవాళ్లు ఎలా డబ్బుని ఖర్చు పెడుతున్నారు. అంతెంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నారనే విషయమై రహస్యంగా కూపి లాగుతున్నారట.

ముఖ్యంగా తెలుగులో నిర్మాణమవుతున్న ఓ భారీ చిత్రంపై ఐటీ శాఖ కన్ను ఉందిట. ఏ క్షణమైనా ఆ హీరో ఇంటిపైనా, ఆ నిర్మాతపైనా దాడి జరగవచ్చంటున్నారు. డబ్బు ఇంత ఇబ్బందికర పరిస్దితుల్లోనూ ఎక్కడ నుంచి తెచ్చి అంత భారీ ఎత్తున షూటింగ్ చేస్తున్నారనే విషయం ఆరా తీస్తున్నారట. సంతృప్తికరమైన సమాధానం వారికి దొరకకపోతే దాడులు తప్పవంటున్నారు. ఇది కేవలం రూమరేనా లేక నిజంగానే ప్లాన్ చేస్తున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది.

English summary
The IT department is taking list of current shooting projects and having plan for a raid.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu