టెన్ ఇయర్స్ గుర్తుండేలా పది నిమిషాలు నాతో గడిపింది...అల్లు అర్జున్

By Sindhu

అల్లు రామలింగయ్య మనవడిగా, అల్లు అరవింద్‌ తనయుడిగా, మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడిగా 'గంగోత్రి' సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన అల్లు అర్జున్‌ రెండో సినిమాతోనే స్టార్‌ డమ్‌ స్వంతం చేసుకున్నారు. ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోయి తన స్టార్‌ డమ్‌ను సుస్థిరం చేసుకున్నారు.అంతేకాదు, తెలుగులోనే కాకుండా వేరే భాషలో స్టార్‌ హోదా అనుభవిస్తున్న ఏకైక తెలుగు కథానాయకుడు అల్లు అర్జున్‌. మళయాళ చిత్రసీమలోని అగ్ర కథానాయకులకున్న క్రేజ్‌ అల్లు అర్జున్‌కు ఉంది. ఇటీవల కాలంలో ఒకటి రెండు చిత్రాలు అల్లు అర్జున్‌ అభిమానులకు కాస్తంత ఆశాభంగం కలిగించిన మాట వాస్తవమే అయినప్పటికీ అవి ఆయన కెరీర్‌ను ప్రభావితం చేసేంతటివి కాదు.

అల్లు అర్జున్ మార్చి 6న వివాహం చేసుకోబోతున్నారు. మరోవైపు వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో తన తండ్రి నిర్మిస్తున్న 'బద్రినాథ్‌' షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి కావస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ ఓ ఇంటర్వ్యూ సందర్బంగా జరిగిన ముచ్చట్లు 'వరుడు" సినిమా తర్వాతే పెండ్లికళ వచ్చిందన్నారు..!అప్పుడు నాన్నగారు ఫంక్షన్‌‌ లో సరదాగా... నాకు వధువును చూస్తున్నామన్నారు. ఇది ఈ రకంగా నెరవేరింది. దేనికైనా సమయం రావాలి అన్నారు అంతేకాకుండా స్నేహ విషయంలో స్నేహాతో జరిగిన ఎంగేజ్‌మెంట్‌ అత్యంత రొమాంటిక్ మూమెంట్. మా ఇద్దరి విషయంలో నేను స్నేహనెప్పుడూ ఏడిపిస్తూ ఉండేవాడిని. తనతో నన్నెప్పుడూ నువ్వు సర్‌ ప్రైజ్‌ చేయలేవని చెప్పేవాడిని. అయితే ఒకరోజు సడన్‌ గా షూటింగ్‌ స్పాట్‌ లో స్నేహ ప్రత్యక్షమైంది. మొదట నేను నమ్మలేదు. ఎవర్నో చూసి స్నేహ అనుకుంటున్నానేమో అనుకున్నాను. సిటీ నుంచి రానుపోను అయిదారు గంటల టైమ్‌ పట్టే ఆ షూటింగ్‌ స్పాట్‌కి వచ్చి స్నేహ నాతో స్పెండ్‌ చేసింది. జస్ట్‌ టెన్‌ మినిట్స్‌. అయితే ఆ టెన్‌ మినిట్స్‌ను నేను టెన్‌ ఇయర్స్‌ తర్వాత కూడా గుర్తుంచుకుంటాను అని అల్లు అర్జున్ ముచ్చటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X